NTV Telugu Site icon

Living Relationship Murder: నెలన్నరగా లివ్​ ఇన్ రిలేషన్షిప్.. ఆపై మర్డర్..?!

6.2

6.2

ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లికాకముందే వారికి ఇష్టం వచ్చిన వారితో సహజీవనం చేస్తున్నారు. నగరాలలో ఎక్కువగా వీటిని చూస్తున్నాము. ఇలా సహజీవనం చేసిన తర్వాత వారు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు లేకపోతే అక్కడితో వారి సహజీవనాన్ని తెంచుకొని ఎవరి జీవితం వారు గడిపేయడం పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా లివ్​ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వారిలో ఓ యువతిని కిరాతకంగా చంపి ఇంట్లోని అల్మరాలో దాచిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Boys Transfer: గజిని సినిమా సీన్‌ రిపీట్‌.. అందులో బాలికలు ఇక్కడ బాలురు..

గుజరాత్ రాష్ట్రం సూరత్ కు చెందిన పీపుల్ తో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మేరేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతీ గత నెలన్నరపైగా లివ్​ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇకపోతే వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని ద్వారక రాజపురి ప్రాంతంలో ఓ ప్లాట్ ను బాడుగకు తీసుకొని అందులో సహజీవనం చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. బుధవారం రాత్రి వీరి మధ్య కాస్త పెద్ద గొడవ కూడా జరిగింది. ఈ సంఘటనలో కోపంతో రెచ్చిపోయిన నిందితుడు విపుల్ యువతుపై దాడికి యత్నించాడు. అయితే ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి తన బాయ్ ఫ్రెండ్ చంపేస్తాడేమోనని కాస్త భయంగా చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: Black Grapes : నల్ల ద్రాక్షలను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..

దీంతో వెంటనే బాధితురాలు తండ్రి ఉన్నపలంగా తన కుమారుడితో కలిసి ఢిల్లీకి వచ్చాడు. ఇందుకు సంబంధించి దబ్రీ పోలీస్ స్టేషన్లో బాధితురాలు తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనలో పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ప్రేమికుల ఉంటున్న ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ ఇంట్లోనే అలమరాలో యువతీ మృతదేహం లభించింది. అలా కనిపించిన ఆమె శరీరంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. దీంతో విపుల్ తన కూతుర్ని తీవ్రంగా కొట్టి చంపేశాడని యువతి తండ్రి ఆరోపిస్తున్నారు. యువత మృతదేహాన్ని ఇంట్లోనే అలమరాల్లో దాచి విపుల్ పారిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించి వివరాలను పక్క ప్లాటు లో నివసిస్తున్న వారి వద్ద నుండి కొన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలీసులు.