నేడు ఆత్మకూరు ఉపఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం అయి వుంది. నెల్లూరుపాళెంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది కౌంటింగ్. ఆత్మకూరు ఉప ఎన్నికల కౌంటింగ్ కు విస్తృతంగా ఏర్పాట్లు చేసింది ఈసీ. పటిష్టమైన పోలీస్ భద్రత వలయంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నానికి ఫలితాలు తేలిపోనున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ..అనంతరం ఈ.వి.ఎం.లలోని ఓట్ల లెక్కింపు జరగనుంది. 2019 సాధారణ ఎన్నికలతో పోలిస్తే 18.18 శాతం ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో 82.44 శాతం పోలింగ్ నమోదవ్వగా ఉపఎన్నికల్లో 64.26 శాతం పోలింగ్ నమోదు అయింది. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం బాగా తగ్గింది. ఎన్నికలలో ఓటు హక్కును లక్షా ముప్పై ఏడు వేల ఎనభై ఒకటి మంది వినియోగించుకున్నారు. 14 టేబుళ్ల తో 20 రౌండ్స్ ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ తరఫున భరత్ కుమార్, మరో 12 మంది అభ్యర్ధులు బరిలో వున్నారు. 70 వేల వరకూ మెజారిటీ రావచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
-
ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు... రాజమోహన్ రెడ్డి
ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు.సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం.
రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి లేదు.రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది.ఈ గెలుపుతో మేము చంకలు గుద్దుకోం. 2024 ఎన్నికల చాలా క్లిష్టతరమైన ఎన్నికలు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సిఎం జగన్ వచ్చే ఎన్నికలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. చంద్రబాబును ఎదుర్కొవాలంటే సులువుగా కాదు. చంద్రబాబు అన్ని ఆయుదాలను సమకూర్చి బరిలొకి దిగుతాడు.
-
నాపై బాధ్యత పెరిగింది.. విక్రమ్ రెడ్డి
ప్రజల మద్దతులోనే ఇంతటి ఘనవిజయం. గౌతమ్ రెడ్డి పైన ఉన్న అభిమానం వల్లే భారీగా ఓట్లు వచ్చాయి. నాపై మరింత బాధ్యత పెరిగింది. ఓటమి వల్లే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హామీలను నెరవేరుస్తా- ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
-
బద్వేల్ కంటే తగ్గిన మెజారిటీ
నెల్లూరు: బద్వేల్ ఉప ఎన్నిక కంటే ఆత్మకూరులో తగ్గిన మెజారిటీ. బద్వేల్ డా.సుధ మెజారిటీ 90,533, ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి మెజారిటీ -82888. బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ శాతం - 67.12, ఆత్మకూరు ఉప ఎన్నిక లో పోలింగ్ శాతం 64.26. పోలింగ్ శాతం తగ్గడంతో మెజారిటీలో తేడా.
-
విక్రమ్ రెడ్డి ఘన విజయం
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఘన విజయం.
వైసీపీకి - 82,888
బీజేపీ- 18,216
బీస్పీ -4773
నోటా - 3972
-
బీజేపీ డిపాజిట్ గల్లంతు
ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం ఏకపక్షంగా సాగడంతో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. ఈ క్రమంలో బీజీపీ డిపాజిట్ కోల్పోయింది. ఎంతో ఆశతో మంచి ఓట్లు సాధిస్తామన్న ధీమాతో వున్న నేతలకు నిరాశ ఎదురైంది.
-
ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్
ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. మొత్తం 82888 ఓట్ల మెజారిటీ సాధించారు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘనవిజయం సాధించారు.
-
19వ రౌండ్ ఫలితాలు
ఆత్మకూరు ఉప ఎన్నికల కౌంటింగ్. కొనసాగుతున్న వైసీపీ ఆధిక్యం. 19 రౌండ్లు ముగిసేసరికి 80,161 ఓట్ల మెజారిటీలో మేకపాటి విక్రమ్ రెడ్డి.
-
17 రౌండ్లు ముగిసేసరికి 71887 వేల మెజారిటీ
ఆత్మకూరులో వైసీపీ ప్రభంజనం వీస్తోంది. 17 రౌండ్లు ముగిసేసరికి 71887 వేల మెజారిటీలో వున్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ 13 వేల ఓట్లు సాధించారు. మరో మూడు రౌండ్లు ఉండడంతో మెజారిటీ భారీగా వుంటుందని భావిస్తున్నారు, ఈసారి నోటా ఓట్లు కూడా భారీగానే పోలయ్యాయి.
-
14వ రౌండ్ ఫలితాల వివరాలు
వైయస్సార్ సిపి అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 71525
బిజెపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 13205
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :3691
నోటా : 2990
14వ రౌండ్ (14 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 58320 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.
-
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఫలితాలు
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఫలితాలు
వృద్ధులు, దివ్యాంగుల, ETPBS (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం) పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు
మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు :217
చెల్లిన ఓట్లు : 205
వైఎస్ఆర్సీపీ : 167
బిజెపి :21
బి ఎస్ పి :7
ఇతరులు : 10
తిరస్కరించినవి : 9
నోటా :3
-
12వ రౌండ్ ఫలితాల వివరాలు
12వ రౌండ్ ఫలితాల వివరాలు :
వైసీనీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 61829
బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ : 11175
బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :3405
నోటా : 2598
12 రౌండ్లు ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 50654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఎట్టకేలకు 11 వేల ఓట్లు దాటిన బీజేపీ అభ్యర్థి.
-
11వ రౌండ్ ఫలితాలు
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ లో 11వ రౌండ్ ఫలితాల వివరాలు. 11 వ రౌండ్ ముగిసే సరికి 46,604 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి
-
10వ రౌండ్ ఫలితాల వివరాలు
కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్
10వ రౌండ్ ఫలితాల వివరాలు :
వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 51835
బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ : 9131
బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :2741
నోటా : 2202
10వ రౌండ్ (10 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 42704 ఓట్ల ఆధిక్యం
-
9వ రౌండ్ల ఫలితాల వివరాలు
9వ రౌండ్ల ఫలితాల వివరాలు :
వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 45924
బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ : 8315
బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :2217
నోటా : 1943
మేకపాటి విక్రమ్ రెడ్డి 37609 ఓట్ల ఆధిక్యం
-
8వ రౌండ్ ఫలితాల వివరాలు
8వ రౌండ్ ఫలితాల వివరాలు
వైయస్సార్ సిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 40377
బిజెపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 7485
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :1963
నోటా : 1693
8 రౌండ్లు ముగిసేసరికి మేకపాటి విక్రమ్ రెడ్డి 32, 892 ఓట్ల ఆధిక్యం
-
7వ రౌండ్ ఫలితాల వివరాలు
7వ రౌండ్ ఫలితాల వివరాలు
ఏడవ రౌండ్ లో వైసీపీ అభ్యర్థికి తగ్గిన ఆధిక్యం
వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 35479
బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ : 6561
బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :1702
నోటా : 1485
7 రౌండ్లు ముగిసేసరికి మేకపాటి విక్రమ్ రెడ్డి 28, 918 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు
-
6వ రౌండ్ ఫలితాల వివరాలు
6వ రౌండ్ ఫలితాల వివరాలు
వైపీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 31474
బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ : 5618
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :1105
నోటా : 1341
6వ రౌండ్ (6 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 25856 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు
-
దూసుకుపోతున్న విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఐదవ రౌండ్ ముగిసే సరికి 21 వేల ఓట్ల ఆధిక్యంలో వై.సి.పి.అభ్యర్థి విక్రమ్ రెడ్డి
-
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ హాలు నుండి బయటకు వెళ్ళిపోయారు బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్. ఆయనకు నాలుగు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి కేవలం 3658 ఓట్లు మాత్రమే లభించాయి.
-
నాలుగో రౌండ్ ఫలితాలు
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది.
నాలుగో రౌండ్ ఫలితాల వివరాలు :
వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 21043
బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ : 3658
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :683
నోటా : 699నాలుగో రౌండ్ (4 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 17385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
మూడో రౌండ్ ఫలితాలు
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ ఫలితాలు ఇలా వున్నాయి.
వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 15583
బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ : 2719
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :485మూడో రౌండ్ (మూడు రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 12863 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
రెండో రౌండ్ ఫలితాలు
రెండో రౌండ్ ఫలితాల వివరాలు :
వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 10688
బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ : 1508
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :266రెండో రౌండ్ ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 9180 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
విక్రమ్ రెడ్డికి 5337 ఓట్ల మెజారిటీ
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ లో వైసీపీ తన ప్రభంజనం కొనసాగిస్తోంది. వై.సి.పి.అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కి 5 వేల 337 ఓట్ల మెజారిటీ లభించింది. మొత్తం ఓట్లు- 7332
-
ఆత్మకూరు మొదటి రౌండ్ ఫలితాల వివరాలు
ఆత్మకూరు మొదటి రౌండ్ ఫలితాల వివరాలు
వైఎస్పార్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి : 6067
బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ కి : 730
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసుకి :129
-
కౌంటింగ్ కేంద్రానికి విక్రమ్ రెడ్డి
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. కౌంటింగ్ గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తన విజయంపై ధీమాతో వున్న విక్రమ్ రెడ్డి. కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
-
పోస్టల్ బ్యాలట్ల లెక్కింపులో వివాదం
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. అయితే అక్కడే వివాదం చోటుచేసుకుంది. రెండు ఓట్లు తమకే రావాలంటూ పట్టుబట్టారు బీజేపీ, వైసీపీ ఏజెంట్లు. ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు.
-
కౌంటింగ్ కేందానికి కలెక్టర్
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆత్మకూరులోని కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు కలెక్టర్ చక్రధర్ బాబు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు కలెక్టర్ చక్రధర్ బాబు. 14 టేబుళ్ళపై కౌంటింగ్ కొనసాగుతోంది.
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తున్నారు అధికారులు. అనంతరం ఈ.వి.ఎం.ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు బీజేపీ.అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్. 20 నిముషాల్లోనే తొలి రౌండ్ ఫలితం రానుంది. మాజీ మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ప్రధాన పోటీ బీజేపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. వైసీపీ అభ్యర్థి విజయం ఖాయం అయినా.. మెజారిటీ పైనే వైసీపీ నేతలు గురిపెట్టారు.
-
14 టేబుళ్ళు.. 20 రౌండ్లలో ఫలితాలు
14 టేబుళ్ల తో 20 రౌండ్స్ ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారికే అనుమతి వుంటుందని అధికారులు తెలిపారు. ఏజెంట్లు 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. దీంతో ఏజెంట్లు ఆయా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,338 ఓట్లు ఉండగా-.వాటిలో 1,37,081 పోలయ్యాయి.
