Little Miss Naina : ఓటీటీలోకి మ్యూజికల్ రొమాంటిక్ ఫిలిం.. ఎందులో చూడాలంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ మూవీ ‘96’ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ సినిమాలో స్కూల్ అమ్మాయిగా కనిపించిన గౌరీ కిషన్ తన నటనతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.96 మూవీ తెలుగులో ‘జాను’ అనే టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది.. ఈ మూవీలో కూడా గౌరీ కిషన్ స్కూల్ అమ్మాయిగా ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం గౌరీ కిషన్ పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లిటిల్ మిస్ నైనా..మలయాళంలో ‘లిటిల్ మిస్ రాథర్’ గా ఆకట్టుకున్న ఈ మూవీ తెలుగులో ‘లిటిల్ మిస్ నైనా’ గా నేరుగా ఈటీవీ విన్లోకి వచ్చింది. జనవరి 25 నుంచి ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఈటీవీ విన్లో ప్రసారం అవుతుంది.ఇందులో షేర్షా షెరీఫ్ మెయిన్ లీడ్‌గా నటించారు. నూతన దర్శకుడు విష్ణు దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రత్యేకమైన కథాంశంతో తెరకెక్కింది..
నైనా పొట్టిగా (4 అడుగులు), అభిజిత్ పొడవుగా (6 అడుగులు) ఉండటంతో పొట్టి, పొడుగు కాన్సెప్ట్‌తో అందరినీ నవ్వించేలా ఉండబోతోంది.మధ్య తరగతి కుటుంబలో జన్మించిన నైనా, ఓసీడీ సమస్యతో బాధపడుతుంది. ఆమెకు కాలేజీలో అభిజిత్ పరిచయం అవుతాడు. అతడితో ఆమె ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆమెను విడిచి తను సినిమాల్లో బిజీ అవుతాడు. అప్పుడే నైనా వేరొకరితో పెళ్లికి రెడీ అవుతుందని తెలుస్తుంది. బాధను తట్టుకోలేక, మద్యానికి బానిస అవుతాడు. పెళ్లి చేసుకోబోయే షఫీక్ మంచి వాడు కాదని నైనాకు తెలుస్తోంది. అప్పుడు మళ్లీ అభిజిత్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అభిజిత్ తో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత వీరిద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైంది? అనేవి సినిమాలో చూపించారు. ఈ మూవీలో గౌరీ జి కిషన్, షేర్షా షరీఫ్ నటన ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది.
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!