NTV Telugu Site icon

Kurnool Pushpa: ఏం తెలివిరా నాయనా?.. పుష్ప సినిమా సీన్ తరహాలో మద్యం అక్రమ రవాణా

Kurnool Pushpa

Kurnool Pushpa

Kurnool Pushpa: సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తోంది. సినిమాలో కొన్ని సీన్స్‌ని, ట్రెండ్‌ని యాజ్‌ టీజ్‌గా ఫాలో అవుతున్నారు కొందరు అక్రమార్కులు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన అల్లు అర్జున్‌ పుష్ప మూవీ ఏ రేంజ్‌లో హిట్టైందో అందరికి తెలుసు. అందులో ఫారెస్ట్ అధికారుల కళ్లు గప్పి ఎర్రచందనం దుంగల్ని ఫారెస్ట్ దాటించేందుకు అల్లు అర్జున్‌ కొత్త టెక్నిక్స్‌ని ఫాలో అవుతాడు. ఈ సినిమా తర్వాత చాలా మంది ఇదే తరహాలో గంజాయి, డబ్బు, మద్యం వంటి వాటిని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. అయితే ఏపీలో ఎన్నికల కోడ్‌ అమలవుతోంది. అక్కడికి పొరుగున ఉన్న ప్రాంతాల నుంచి మద్యం తెచ్చేందుకు ఓ నిందితుడు ఎక్సైజ్‌ అధికారుల కళ్లు గప్పి వాహనంలో సరుకును తేవాలని ప్రయత్నించాడు. ప్లాన్‌ బాగానే ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు.

Read Also: Meera Jasmine: తండ్రికి గుడ్ బై చెప్పిన మీరా జాస్మిన్.. ఎమోషనల్ పోస్ట్

కర్నూలు జిల్లా కోడుమూరులో పుష్ప సినిమా సీన్ తరహాలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుజికి క్యారియర్ వాహనాన్ని నిందితుడు మాడిఫికేషన్ చేసి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు. వాహనం వెనుక అడుగు భాగంలో అరలు ఏర్పాటు చేసి పైన ప్లాట్ ఫాం ఏర్పాటు చేశాడు. 3168 టెట్రా ప్యాకెట్లు అరలలో అమర్చి ప్లాట్ ఫాంపైన టమోట ఖాళీ బాక్స్‌లను ఆ వ్యక్తి వేశాడు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB) పోలీసులు ఆ బండిని ఆపి తనిఖీలు నిర్వహించారు. ఖాళీ బాక్సులు కర్నూలుకు వెలుతుండటంతో అనుమానించిన పోలీసులు ఆ బండిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు తరలించి నిశితంగా పరిశీలించడంతో గుట్టరట్టు అయింది. అక్రమంగా తరలిస్తున్న 3168 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో మద్యం విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని సెబ్ పోలీసులు తెలిపారు.