Site icon NTV Telugu

CM Chandrababu: “మనమీద నెట్టే రకం”.. మద్యం కుంభకోణంపై స్పందించిన సీఎం చంద్రబాబు..

Cm Chandrababu Ap

Cm Chandrababu Ap

మద్యం కుంభకోణంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరిందన్నారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని.. ప్రజాధనం ఎలా దోచుకోవచ్చో మద్యం స్కామ్ ఒక పరాకాష్ఠ అన్నారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలనే ఇప్పటివరకు మాట్లాడలేదని.. జగన్ తాను చేసిన తప్పుల్ని కూడా మన మీద నెట్టే రకమని విమర్శించారు.. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నందున ఎంపీల తీరు ఇంకా మెరుగుపడాలని తెలిపారు. రాష్ట్ర అంశాలే ప్రధాన అజెండాగా ఎంపీలు ఇంకా బాగా మాట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రగతిని దేశస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదే అని సీఎం వెల్లడించారు. క్రిమినల్స్ తో రాజకీయాలు చెయ్యాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

READ MORE: Anandi : గరివిడి లక్ష్మి ఎంత అందంగా ఉందో చూశారా!

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా మద్యం కుంభకోణంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. “అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారు. ప్రజాధనం విచ్చలవిడిగా దోచుకున్నారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. కేసు విచారణ పారదర్శకంగా జరగాలనే ఇప్పటి వరకు మాట్లాడలేదు. జగన్‌.. తాను చేసిన తప్పుల్ని కూడా మనమీద నెట్టే రకం’’ అని చంద్రబాబు అన్నారు.

READ MORE: Louise Fischer: లైవ్ ఇంటర్వ్యూలో శృంగారంలో పాల్గొన్న రిపోర్టర్.. వీడియో వైరల్!

Exit mobile version