మద్యం కుంభకోణంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరిందన్నారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని.. ప్రజాధనం ఎలా దోచుకోవచ్చో మద్యం స్కామ్ ఒక పరాకాష్ఠ అన్నారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.