రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ నెలకొంది. సిట్ అధికారులు కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకురానున్నారు. దీంతో సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో పోలీసుల సైతం భారీగా తరలివచ్చారు. జైలు గేటుకు కొంత దూరంలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన కార్యకర్తలందరినీ అక్కడే నిలువరించారు. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో త్వరలో అతి పెద్ద తిమింగలం బయటకొస్తుందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమన్నారు.
MP Mithun Reddy: గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ (జూలై 19న) సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
మద్యం కుంభకోణంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరిందన్నారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని.. ప్రజాధనం ఎలా దోచుకోవచ్చో మద్యం స్కామ్ ఒక పరాకాష్ఠ అన్నారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.