Site icon NTV Telugu

Liquor Prices: మందు బాబులకు బిగ్ షాక్.. మరోసారి మద్యం ధరలు పెంపు?

Ap Liquor Scam

Ap Liquor Scam

తెలంగాణలో మందుబాబులకు షాక్ అనే చెప్పొచ్చు. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమైంది. తెలంగాణలో మద్యం పై సెస్ ను ఎక్సైజ్ శాఖ సవరించింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను మళ్ళీ పునరుద్ధరించింది. 2020లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను ప్రవేశపెట్టింది. పలు కారణాలతో 2023లో ఎక్సైజ్ శాఖ ఎస్ఈఎస్ ను తీసివేసింది. ఇప్పుడు మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను ప్రవేశపెట్టి.. కొన్ని రకాల మద్యం బాటిల్స్ పై సెస్ పెంచింది. బీర్లపై, ఛీప్ లిక్కర్ పై, రెడీ టూ డ్రింక్ (బ్రీజర్ లాంటి పానీయాలు) పై ఎస్ఈఎస్ ను సవరించలేదని.. వాటిపై పాత పన్నులు యథావిధిగా ఉంటాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

READ MORE: Bangladesh: భారత్‌కి వ్యతిరేకంగా యూనస్ మరో కుట్ర.. రహస్యంగా చైనా అధికారుల పర్యటన..

తాజాగా.. తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు పంపింది.180 ml(క్వార్టర్) బాటిల్ పై10 రూపాయలు, ఆఫ్ బాటిల్ కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు పెంచుతున్నట్లు మద్యం దుకాణాలకు జారీ చేసిన సర్క్యులర్లలో పేర్కొంది. దీంతో మద్యం ప్రియుల్లో ఆందోళన నెలకొంది.

READ MORE: Hyderabad: హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్.. ఐసీస్ ఆపరేషన్‌ని భగ్నం చేసిన పోలీసులు

Exit mobile version