Lionel Messi: దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా తన సంతకం చేసిన అర్జెంటీనా 2022 FIFA ప్రపంచకప్ జెర్సీని పంపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుండి 15 వరకు మెస్సీ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, డిసెంబర్ 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న మెస్సీ, మరుసటి రోజు ముంబైకి బయలుదేరతారు. డిసెంబర్ 15న న్యూఢిల్లీలో తన పర్యటనను ముగించనున్నారు. అక్కడ ఆయన ప్రధాని మోడీని కలుసుకునే అవకాశం ఉంది.
ఈ విషయంపై మెస్సీ పర్యటన ప్రమోటర్, స్పోర్ట్స్ ఎంట్రప్రెన్యూర్ సతద్రు దత్తా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 75వ పుట్టినరోజుకు మెస్సీ సంతకం చేసిన జెర్సీని పంపారు. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధానితో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. భారత అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీలో మొదటిసారి పర్యటించి అభిమానులను కలవడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారని అన్నారు.
PM Modi: బీహార్‌ని తక్కువ అంచనా వేయొద్దు.. ఇక్కడ తయారైన రైలు ఇంజిన్‌లను ఆఫ్రికాకు ఎగుమతి..!
అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ (AFA) ప్రకారం, ఈ నవంబర్ లో కేరళలో ప్రపంచ ఛాంపియన్లు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ ప్రణాళికలు అనుకున్నట్లు జరిగితే, ఫిఫా అంతర్జాతీయ మ్యాచ్ విండో సమయంలో ఆ మ్యాచ్ కు మెస్సీ నాయకత్వం వహించే అవకాశం ఉందని కేరళ క్రీడల శాఖ మంత్రి ధృవీకరించారు. కేరళ ఫుట్ బాల్ అసోసియేషన్ (KFA), ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (AIFF)తో కలిసి వేదిక ఎంపికతో సహా పూర్తి పనులను ఖరారు చేయడానికి కృషి చేస్తోంది. ఒకవేళ మెస్సీ కేరళ పర్యటనకు తన జట్టుతో వస్తే, రెండు నెలల్లో రెండుసార్లు భారతదేశాన్ని సందర్శించినట్లవుతుంది.
