Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lionel Messi: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన తర్వాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన నేలపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ముందుగా అర్జెంటీనా ఆటగాళ్లను వేదికపైకి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రన్నరప్ జట్టుకు పతకాలు అందజేశారు. మెస్సీ ట్రంప్‌తో కరచాలనం చేసి ముందుకు వెళ్లబోతుండగా.. ఆయనను ఆపి రన్నరప్ మెడల్‌ను మెడలో వేశారు. ఆ క్షణంలో మెస్సీ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
Also Read
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
İspanya Milli Takımı, Lionel Messi ve Arjantin Milli Takımı'nı alkışlarla onurlandırdı. pic.twitter.com/c73Dr8w6lT
— Messi Anıları (@messianilari) July 19, 2026
39 ఏళ్ల మెస్సీకి ఈ ఓటమి కేవలం ఫైనల్ పరాజయం మాత్రమే కాదు.. అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశలో ఎదురైన అత్యంత బాధాకరమైన క్షణంగా అభిమానులు భావిస్తున్నారు. ఎన్నో విజయాలు అందుకున్నా, చివరి వరల్డ్ కప్‌ను ట్రోఫీతో ముగించాలన్న ఆయన కల నెరవేరలేదు. అయితే మెస్సీ కన్నీళ్లు చూసిన స్పెయిన్ సంచలనం ‘లామిన్ యమాల్’ ఆయన వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని ఓదార్చాడు. చిన్నతనంలో మెస్సీ ఒడిలో ఆడిన యమాల్, ఇప్పుడు తన ఆదర్శ ఆటగాడికి ఓదార్చిన దృశ్యాలు అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి.
Arjantinli taraftarlar, Lionel Messi'ye sevgi gösterisinde bulunuyor. 🥹 pic.twitter.com/T4UbTgj3oT
— Messi Anıları (@messianilari) July 19, 2026
మరోవైపు ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయినప్పటికీ.. టోర్నమెంట్ మొత్తం మెస్సీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 8 గోల్స్ చేయడంతో పాటు 4 అసిస్టులు అందించి జట్టు 12 గోల్స్‌లో కీలక పాత్ర పోషించారు. గ్రూప్ దశ నుంచి నాకౌట్ మ్యాచ్‌ల వరకు అర్జెంటీనాను ముందుండి నడిపించిన మెస్సీ, అల్జీరియాపై హ్యాట్రిక్‌తో పాటు కీలక మ్యాచ్‌ల్లో గోల్స్, అసిస్టులతో తన సత్తాను మరోసారి నిరూపించారు. అంతేకాదు, ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో మెస్సీ తన మొత్తం గోల్స్ సంఖ్యను 21కు చేర్చి మరో అరుదైన ప్రపంచ రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నారు. ట్రోఫీ దక్కకపోయినా.. మెస్సి ప్రదర్శన మాత్రం మెప్పించింది.
Lamine Yamal comforting Lionel Messi after the final is easily the most wholesome moment you’ll see today. 🥹❤️ pic.twitter.com/efGNbaWc4A
— MC (@CrewsMat10) July 19, 2026
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!