జయహో Lionel Messi.. వరల్డ్‌కప్ టాప్ స్కోరర్‌గా కొత్త రికార్డు! నాకౌట్ లోకి అర్జెంటీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో తన ప్రాముఖ్యత ఏంటో లియోనెల్ మెస్సీ నిరూపించారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆస్ట్రియాతో జరిగిన గ్రూప్-J మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి పురుషుల వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును అధిగమించి.. 18 గోల్స్‌తో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు.
డల్లాస్ లోని AT&T స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీకి ప్రారంభంలోనే రికార్డు సాధించే అవకాశం రాగా.. అయితే అతడు కొట్టిన పెనాల్టీని ఆస్ట్రియా గోల్ కీపర్ అడ్డుకోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే మెస్సీ అక్కడితో ఆగలేదు. 38వ నిమిషంలో బాక్స్ అంచున బంతిని అందుకున్న అతడు తనదైన శైలిలో అద్భుతమైన షాట్ తో గోల్ సాధించాడు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
ఆ గోల్‌తో వరల్డ్ కప్ లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో గోల్ చేసిన మూడో ఆటగాడిగా కూడా మెస్సీ నిలిచాడు. అంతకుముందు ఈ ఘనతను ఫ్రాన్స్ లెజెండ్ జస్ట్ ఫాంటైన్, బ్రెజిల్ దిగ్గజం జైర్జిన్హో మాత్రమే ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆస్ట్రియా మంచి డిఫెండింగ్ తో అర్జెంటీనాకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. మెస్సీ మాయాజాలాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. మ్యాచ్ చివరి నిమిషాల్లో మరోసారి మెస్సీ తన క్లాస్ ఆటను చూపించాడు. జూలియన్ అల్వారెజ్ చేసిన ప్రయత్నం విఫలమైన తర్వాత వచ్చిన రీబౌండ్‌ను ఎంతో చాకచక్యంగా గోల్ గా మలిచి తన 18వ వరల్డ్ కప్ గోల్ నమోదు చేశాడు. దీంతో అర్జెంటీనా 2-0 తేడాతో విజయం సాధించడమే కాకుండా నాకౌట్ దశకు కూడా అర్హత సాధించింది.
Lionel Messi has broken the record for all-time goals at the #FIFAWorldCup 💫 pic.twitter.com/JqUCGxomAF
— FIFA World Cup (@FIFAWorldCup) June 22, 2026
ఈ టోర్నీలో ఇప్పటికే ఐదు గోల్స్ చేసిన మెస్సీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 38 ఏళ్ల వయసులోనూ అతడి ఆటతీరు యువ ఆటగాళ్లను తలపించేలా ఉంది. అంతేకాదు, వరల్డ్‌కప్ చరిత్రలో 6 ఎడిషన్లు ఆడిన తొలి ఆటగాడిగానూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అత్యధిక వరల్డ్‌కప్ మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు, అత్యధిక విజయాలు వంటి అనేక రికార్డులను కూడా మరింత మెరుగుపర్చుకున్నాడు మెస్సి.
2022లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా, ఇప్పుడు వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో దూసుకెళ్తుంది. అల్జీరియాపై హ్యాట్రిక్, ఆస్ట్రియాపై డబుల్‌తో మెస్సీ మరోసారి టోర్నమెంట్లో దూకుడుగా కొనసాగుతున్నాడు. అంతేకాదు అతడి నాయకత్వంలో అర్జెంటీనా జట్టు టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
El segundo de messi es un gol estratosférico, no por lo que es, por lo que representa.
Ganando 1-0, minuto 95, 39 años, a la contra, corriendo 40 metros, hace un pase brutal a un compañero, este lo falla, messi la recibe, regatea y falla, en vez de quejarse se tira como un loco… pic.twitter.com/aUXb2cv8K9
— Ivan Abad (@NetMentorTW) June 22, 2026
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!