భారతీయ సంప్రదాయాల్లో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఒక వ్యక్తితో ఒకేసారి పెళ్లి జరుగుతుంది.. ఇది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. నా ఇష్టం నా పెళ్లి అంటున్నారు జనాలు. పెళ్లి ఎన్ని సార్లు ఎంతమందితో చేసుకున్నా కూడా పెళ్లికి ముందు తమకు కాబోయేవారి గురించి తప్పక తెలుసుకోవాలని అంటున్నారు.. అప్పుడే ఎటువంటి గొడవలు పెళ్లి తర్వాత రావని పెద్దలు అంటున్నారు.. మరి పెళ్లికి ముందే తమ కాబోయే వారిని ఎటువంటి ప్రశ్నలు అడగాలో, ఎటువంటి ప్రశ్నలు అడగ కూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా, పెద్దలు కుదర్చిన పెళ్లి అయిన తమ పార్ట్నర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను అడిగి తెలుసుకోవాలి..పెళ్లికి ముందే ఇద్దరి మధ్య ఉండే కమ్యూనికేషన్ మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ బాధ్యత ఇద్దరిపై ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటే చిన్న చిన్న వివాదాలు రేకెత్తినా వెంటనే సర్దుకుంటాయి. బంధం నిలబడాలి అంటే పునాది పటిష్ఠంగా ఉండాలి. ఆర్థిక స్థితిగతులతోపాటు పొదుపు గురించి, లేదంటే డబ్బు ఖర్చు గురించి మొత్తం విషయాలు మాట్లాడుకోవాలి.ఇద్దరు సంపాదించిన కూడా సరిపోదు.. ఖర్చులు అలా అవుతున్నాయి.. అలాగే ఫుడ్ విషయాల్లో కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి..
భవిష్యత్ లో కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఇద్దరూ ముందే మాట్లాడుకోవాలి. కెరీర్ కి సంబంధించి, భవిష్యత్ లక్ష్యాల గురించి ఒకర్నొకరు పంచుకోవాలి. ప్లానింగ్ ఎలా ఉంటుంది? ఎలా అమలు చేయాలి? తదితర విషయాలను చర్చించుకోవాలి. పెళ్లికి ముందు బ్రేకప్స్ ఉంటే ముందే చెప్పుకోవాలి. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?.. అలాగే ఖాళీ సమయం ఎక్కువ ఏం చేస్తారు..హాబీల గురించి కూడా మాట్లాడుకోవాలి. అంతేకాదు.. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే మాట్లాడుకోవాలి.. వెయ్యి అబద్దాలు ఆడి పెళ్లి చెయ్యమన్నారు.. కానీ ఒకప్పుడు ఆ పప్పులు ఉడికేవి.. ఇప్పుడు అలా కాదు తేడా జరిగితే డివోర్స్ అంటున్నారు.. ఇది గుర్తుంచుకోండి.. పెళ్లికి ముందే ఇవి క్లియర్ చేసుకోవడం మంచిది..