NTV Telugu Site icon

Lic Super Plan : మహిళల కోసం అదిరిపోయే ప్లాన్.. రూ.87 ఇన్వెస్ట్ చేస్తే,రూ. 11 లక్షలు మీ సొంతం..

Licc

Licc

అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్లకు ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. అందులో మహిళలకు కూడా మంచి ప్రయోజనాలున్న ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఆధార్ శిలా ప్లాన్ నాన్-లింక్డ్ స్కీమ్, అంటే ఇది స్టాక్ మార్కెట్ పనితీరు లేదా మరే ఇతర పెట్టుబడిపై ఆధారపడి ఉండదు. ఈ స్కీమ్ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు పాలసీ హోల్డర్‌కు, లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ పథకంలో రోజుకు కేవలం రూ.87 పెట్టుబడి పెట్టి, పాలసీదారు రూ.11 లక్షల వరకు మెచ్యూరిటీ బెనిఫిట్ అందుకోవచ్చు.. ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 15 ఏళ్ల పాలసీ కాలానికి ఈ పథకాన్ని కొనుగోలు చేశారనుకుందాం. ఆమె రోజుకు రూ.87 ప్రీమియం చెల్లిస్తుంది, ఇది సంవత్సరానికి రూ.31,755 అవుతుంది. 15 ఏళ్లలో ఆమె మొత్తం రూ. 4,76,325 ప్రీమియంగా చెల్లిస్తుంది. అయితే, పాలసీ మెచ్యూర్ అయినప్పుడు, ఆమె మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.11 లక్షలు అందుకుంటుంది.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చెయ్యాలనుకొనేవారికి కనీసం 8 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉంటుంది..

మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి పాలసీ వ్యవధిని 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు, అంటే పాలసీదారు రిటైర్‌మెంట్ తర్వాత కూడా స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. కనీస హామీ మొత్తం రూ.75,000, గరిష్ఠ హామీ మొత్తం రూ.3 లక్షలు.. పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా కారణాల వల్ల మరణిస్తే నామీనికి మొత్తం వస్తుంది.. పాలసీదారు కనీసం రెండేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు.. 80 సి పన్ను మినహాయింపు కూడా ఉంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..