LIC Jeevan Shanti Plan: మనలో చాలామంది వారు సంపాదన నుండి కొంత మొత్తాన్ని ఆదా చేసి, తమ డబ్బు సురక్షితంగా ఉండేలా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. అలాగే తమ పెట్టుబడిపై మంచి రాబడిని వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ LIC సంబంధించిన రిటైర్మెంట్ ప్లాన్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టారు. ఈ పాలసీలలో ఒకటి LIC న్యూ జీవన్ శాంతి ప్లాన్. ఇది ఒకే ప్రీమియం ప్లాన్. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే మీరు ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష వరకు పెన్షన్ పొందవచ్చు. మరి ఈ ప్రత్యేక పాలసీ గురించి ప్రత్యేకంగా తెలుసుకుందామా..
Read Also: CV Anand: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు.. ఏకంగా 138 దేశాలు పోటీ!
ఈ పాలసీలో ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత మీకు క్రమం తప్పకుండా పెన్షన్ హామీ ఇస్తుంది. అంటే, దీనిలో ఒకే పెట్టుబడి తర్వాత, మీరు పదవీ విరమణ తర్వాత జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు. LIC ఈ పాలసీ తీసుకోవడానికి వయోపరిమితిని 30 నుండి 79 సంవత్సరాల వరకు నిర్ణయించారు. ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ లేనప్పటికీ, దానిలో లభించే ప్రయోజనాలు దీనిని బాగా ప్రాచుర్యం పొందేలా చేస్తున్నాయి. ఈ LIC ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ రెండు ఎంపికలను అందిస్తుంది. వీటిలో ఒకటి సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ, అలాగే రెండవది జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ. అంటే, మీరు కోరుకుంటే మీరు ఒకే ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా మీరు రెండు కలిపి ఎంపిక ఎంచుకోవచ్చు.
LIC న్యూ జీవన్ శాంతి పథకం ఒక యాన్యుటీ ప్లాన్. దీనిని కొనుగోలు చేయడం ద్వారా మీరు దానిలో మీ పెన్షన్ పరిమితిని నిర్ణయించవచ్చు. పదవీ విరమణ తర్వాత జీవితాంతం స్థిర పెన్షన్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది గొప్ప వడ్డీని ఇస్తుంది. ఈ పథకం ప్రకారం 55 ఏళ్ల వ్యక్తి ఈ పథకాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు రూ. 11 లక్షలు డిపాజిట్ చేసి ఐదు సంవత్సరాలు ఉంచుకుంటే.. మొత్తం పెట్టుబడిపై మీరు సంవత్సరానికి రూ. 1,01,880 కంటే ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. ఆరు నెలల ప్రాతిపదికన పొందే పెన్షన్ మొత్తం రూ. 49,911 అలాగే నెలవారీ పెన్షన్ రూ. 8,149 గా అవుతుంది.