NTV Telugu Site icon

Milk Benefits: రోజూ పాలు తాగితే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందామా..

Milk

Milk

పాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. క్యాల్షియం, మాంస కృత్తులు, కొవ్వులు, విటమిన్ ఎ, బి ఇలా చాలా రకాల పోషకాలు పాలలో ఇమిడి ఉంటాయి. పాలపై ఎన్నో ఆపోహలు ఉన్నాయి. అందుకే పలువురు తగినన్ని పాలు తీసుకోవడంలో విఫలమవుతుంటారు. రోజూ పాలు తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం.. క్యాల్షియం మన శరీరానికి చాలా అవసరం. ఎముకలు పటుత్వం కోల్పోకుండా గట్టిగా ఉండాలంటే క్యాల్షియం తప్పనిసరిగా ఉండాల్సిందే. పాలల్లో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఆకు కూరల్లో కూడా క్యాల్షియం ఉన్నా.. మన శరీరం అంతగా గ్రహించలేదు. అదే పాలలో ఉన్న క్యా్ల్షియం అయితే త్వరగా ఒంటపడుతోంది. తగినన్ని పాలు తాగితే.. రోజుకు అవసరమైన క్యాల్షియంలో 91 శాతం పొందినట్లే. అంతే కాకుండా పాలలో రోజు వారి పనులకు కావాల్సిన చక్కెర, ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. 150 మిల్లీ లీటర్ల పాలలో సుమారు 130 కొలో కేలరీల శక్తి, 4.5 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల పిండి పదార్థం, 5 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. బియ్యంలో లేని లైసిన్, త్రియోనైన్, అనే అమైనో ఆమ్లాలనూ పాలతో భర్తీ చేసుకోవచ్చు.

READ MORE: Uttar Pradesh: సమ్మర్ ఎఫెక్ట్.. విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన

రోజూ పాలు తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.. గుండె జబ్బులు, పక్షవాతం ముప్పుల నుంచి తప్పించుకోవడానికి క్యాల్షియం ఉపయోగపడుతుంది. ఎముకల పటుత్వమే కాకుండా గుండె, రక్త నాళాల సమస్య దూరమవుతుంది. పాలలో ఉండే పోటాషియం, మెగ్నీషియం, పెప్టైడ్లు రక్త పోటు తగ్గడానికి ఉపయోగ పడతాయి. పాలు మన పళ్ల మీద ఉండే గట్టి పొరను దెబ్బతినకుండా చూస్తుంది. పాలలో ఉండే ల్యాక్టిక్ ఆమ్లం చర్మం మెరుపునకు తోడ్పడుతుంది. పాలతో తయారు చేసిన పెరుగు, మజ్జిగను తరచూ తీసుకుంటే.. ఛాతిలో మంట వంటి లక్షణాలు తగ్గుతాయి. పెద్దపేగు క్యాన్సర్ బాధితులకు పాలతో మంచి ఉపశమనం కలుగుతుంది. పాలతో విటమిన్ ఎ లభిస్తుంది. దీంతో విటమిన్ ఎ వల్ల తలెత్తే రేచీకటి, తెల్లగుడ్డు మీద మచ్చలు, నల్లగుడ్డు కుంగిపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు పాలతో కలుగుతాయి. కాబట్టి తరచూ పాలు తాగుతూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.