NTV Telugu Site icon

Leopard in Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. భక్తులకు అధికారుల హెచ్చరిక

Leopard

Leopard

Leopard in Srisailam: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది.. పాతాళ గంగ పాత మెట్ల మార్గం వెళ్లే వైపు చిరుత సంచారం కలకలం రేపింది పాత మెట్ల మార్గం ఆనుకొని ఉన్న అటవీప్రాంతంలో నుండి చిరుత బయటకు వచ్చి.. రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుత చాలాసేపటి వరకు (సుమారు అరంగట) డివైడర్ పై అటు ఇటు చూస్తూ ఉన్న దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్ లో వీడియో తీశారు.. ఇక, చాలాసేపు డివైడర్ పై కూర్చొని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది.. అయితే, జనావాసం తిరుగుతున్న ప్రాంతంలో చిరుత బయటకు రావడంతో.. పాత మెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Read Also: Crows Viral Video: కాకిని తాడుతో కట్టేసిన చికెన్ షాప్ యజమాని.. రివేంజ్ తీర్చుకున్న కాకుల గుంపు!

అయితే, గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుత సంచరించగా అప్పట్లో అటవీశాఖ అధికారులు డోలు శబ్దాలు చేయించడంతో తర్వాత చిరుత కనిపించకుండా పోయింది.. కానీ, మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అదే ప్రాంతంలో తిరుగుతుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.. ఇప్పుడు కూడా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత.. నివాస ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. అయితే అటవీశాఖ అధికారులు.. దేవస్థానం అధికారులు స్థానికులు, భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. రాత్రి సమయాల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.