Leopard Attack: మాజీ సర్పంచ్‌ని చంపేసిన చిరుత.. తల మొత్తం..!
- నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పచర్లలో దారుణం
- పచర్ల మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసాపై దాడి చేసి చంపేసిన చిరుత..
- కట్టెల కోసం అడవిలో వంక వద్దకు వెళ్లిన షేక్ మెహరున్నిసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard Attack: నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పచర్లలో దారుణం జరిగింది. పచర్ల మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేసి చంపేసింది. కట్టెల కోసం అడవిలో వంక వద్దకు వెళ్లిన షేక్ మెహరున్నిసా పై చిరుత దాడి చేసింది. షేక్ మెహరున్నిసాను చంపి తలను తినేసినట్లు స్థానికులు చెబుతున్నారు. షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేయడంతో కేకలు వేసిందని, ఆ కేకలు విన్న స్థానికులు వంక వద్దకు వెళ్లేసరికి చిరుత అప్పటికే చంపేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. స్థానికులకు మొహారాన్నేసాల్ మాట్లాడుతూ.. మెహరున్నిసా మొండెం మాత్రమే కనిపించింది అని వెల్లడించారు.. అయితే, కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీ పై కూడా చిరుత దాడి చేసి గాయపరిచింది. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. చిరుత దాడి ఘటనతో అటవీ అధికారులు పచర్లకు బయలుదేరి వెళ్లారు. ఆ చిరుతను వెంటనే బంధించి.. తమ ప్రాణాలు కాపాడాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: Puneeth Rajkumar: పునీత్ ఆత్మతో మాట్లాడిన స్వామీజీ.. కుమార్తె కడుపున పుడతానంటూ!
Also Read
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!