Leopard Hulchul: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కర వనం – హౌసింగ్ బోర్డ్ కాలనీల సమీపములో అర్ధరాత్రి చిరుతపులి సంచరించిన నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరించి ఒక జంతువును నోట కరుచుకుంది అనే వార్త స్థానికంగా అలజడి రేపింది. దీనిలో నిజానిజాలను తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఒకచోట అనుమానాస్పదంగా ఉన్న ఒక పగ్ మార్క్ ను చూసి .. అది ఏ జంతువుకు సంబంధించినది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక ఈ ప్రాంతాలతో పాటు పుష్కర వనంలోనూ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతపులి సంచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దివాన్ చెరువు సెక్షన్ డీఆర్ఐ పద్మావతి పర్యవేక్షణలో బోను కూడా ఏర్పాటు చేశారు.
Read Also: Khammam: నేటి నుంచి ఖమ్మంలో రూ.10వేల సాయం.. మూడు రోజుల్లో ప్రక్రియ ముగించనున్న సర్కార్..