NTV Telugu Site icon

Leopard Attack: కళ్లుమూసి తెరిచేలోపు చిరుతకి ఆహారమైన శునకం.. వైరల్ వీడియో..

Leopard Attack

Leopard Attack

సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయానకంగా ఉంటాయి, మరికొన్ని తమాషాగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా ఆన్‌లైన్‌లో కనపడుతున్నాయి. కొన్ని వీడియోలు త్వరగా వైరల్ అవుతూ సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి వీడియోలలో మరొక వీడియో కొత్తగా జాయిన్ అయ్యింది. ఇకపోతే ఈ ఘటన జైపూర్‌లోని ఝరానాలో చోటుచేసుకుంది. చిరుత కుక్కపై దాడి చేసి వెంబడించింది. ఈ వేట కేవలం 5 సెకన్లలో పూర్తయింది. 28 సెకన్ల నిడివి గల ఆన్‌లైన్ వీడియోలో చిరుతపులి కుక్కను వెంబడించి, మెడ పట్టుకుని అడవిలోకి తీసుకువెళుతున్నట్లు చూపిస్తుంది.

Also Read: Snake Raja: వీడెవడ్రా స్వామి.. వాటిని పాములనుకున్నాడా లేక మరేమైనా అనుకున్నాడా.. వైరల్ వీడియో..

ఇక ఈ వీడియోకు శీర్షికగా.. “జలానా అడవి జైపూర్‌తో అనుసంధానించబడి ఉంది. ఇక్కడ వందల సంఖ్యలో చిరుతలు ఉన్నాయి. నగరానికి అనుసంధానం కావడంతో వీధికుక్కలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.” అని పేర్కొన్నారు.

Also Read: Elephant attack: ఏనుగుల దాడిలో ప్రముఖ న్యూస్ ఛానెల్ కెమెరామెన్ మృతి..

ఇక వైరల్ గా మారిన వీడియోను గమనించినట్లైతే.. ముందుగా ఓ కుక్క అడవిలో తిరుగుతుంది. అటుగా ఎండిన గడ్డిలో దాక్కున్న చిరుతపులి కుక్కను వేటాడడం ప్రారంభిస్తుంది. క్షణంలో, చిరుత ఒక మీటరు దూరంలో ఉన్న కుక్కపై దాడి చేస్తుంది. చిరుతపులి నేరుగా కుక్క మెడపై దాడి చేసి సెకన్ల వ్యవధిలో చంపేసింది. వీడియో చివర్లో, చిరుతపులి కుక్కను నోటిలోకి తీసుకొని అడవిలోకి తీసుకువెళుతుంది. తక్కువ సమయంలోనే ఈ వీడియో వేలాది మంది వ్యక్తులు లైక్ చేయగా., లక్షల సంఖ్యలో వీక్షించారు. ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్.. “చిరుత వేట నిజంగా ప్రమాదకరమా..?” అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు “అటవీ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ” కామెంట్స్ చేశారు.