LEO : విజయ్ దళపతి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఖైదీ మరియు విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ నటించిన ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న విడుదల అవుతుండగా… ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. లియో సినిమా లో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది.. ఈ సినిమా లో విజయ్ సరసన సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ మరియు సంజయ్ దత్ విలన్స్ గా నటిస్తున్నారు.
లియో సినిమాను ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం తెలిపారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ఘనంగా సంబరాలు చేయాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. విజయ్ సినిమా అంటేనే అభిమానులు పండగలా చేస్తుంటారు. కటౌట్లు, ప్లెక్సీలు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హంగామా చేస్తుంటారు. తాజాగా లియో సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. సాధారణంగా రిలీజ్ కు రెండు రోజుల ముందే మొదలవుతాయి. కానీ లియో సినిమాకు ఏకంగా ఆరు రోజుల ముందే బుకింగ్స్ మొదలయ్యాయి.ఇదిలా ఉంటే లియో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం విజయ్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా లియో సినిమా కు ప్రత్యేక షోలు లేవు అని.. ఎవరైనా షోలు వేయాలని గొడవకు దిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ అముత పోలీసులను ఆదేశించారు. థియేటర్లలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలతో పాటు అభిమానులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాలని అముత ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో దళపతి అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..