NTV Telugu Site icon

LEO : లియో ‘బాడాస్’ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది…

Whatsapp Image 2023 10 07 At 6.33.18 Pm

Whatsapp Image 2023 10 07 At 6.33.18 Pm

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ ఆంటోనీ దాస్‌ గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది.భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన మొదటి రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది.అక్టోబర్‌ 19 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా థియేటర్ల లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యం లో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్,  గ్లింప్స్, ఫస్ట్‌ సింగిల్ మరియు ట్రైలర్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ మూవీ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి అభిమానులను బాగా నిరాశపరిచింది. , అభిమానుల కోరిక మేరకు మూవీ నుంచి వరుసగా అప్‌డేట్‌లను ఇస్తామని అయితే తెలిపింది. ఈ నేపథ్యం లో మేకర్స్ తాజాగా ఒక అప్‌డేట్ ఇచ్చారు.ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ బాడాస్ ను తమిళ్ వెర్షన్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సాంగ్ తెలుగు వెర్షన్‌ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ”సింగం సరసరా వేటకు దిగితే తన దాడికి అడవికి హడలే. చెడు చెరపగా తన గురి పెడితే మదం వదిలిన మందలు పరుగే. తను అసలొక చల్లని పవనం బాడాస్”. అంటూ సాగిన ఈ పాట ఫుల్ మాస్ ప్రేక్షకులకు అదరిపోయే ట్రీట్ ను అందించింది..మరోవైపు లియో నుంచి లాంఛ్ చేసిన నా రెడీ సాంగ్‌ ఇప్పటికే నెట్టింట మిలియన్ వ్యూస్ రాబడుతోంది.