Spy Caught With Lemon: ఏ దేశానికైనా నిఘా నేత్రాలు గూఢచారులే. ప్రపంచ దేశాలపై నిఘా ఉంచి వారి సొంత దేశాలకు వ్యతిరేకంగా ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా వెంటనే చేరాల్సిన చోటుకు ఆ సమాచారాన్ని చేరవేయడంలో గూఢచారులు సిద్దహస్తులు. అందుకే గూఢచారుల ఎంపికలు అత్యంత కష్టతరమైనవిగా ఉంటాయి. పొరపాటున వాళ్లు దొరికిన ప్రాణాలతో బయటపడే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్లు ఏదేశం కోసం అయితే పని చేస్తారో ఆ దేశం వాళ్లు ఇతర దేశాల్లో గూఢచర్యం చేస్తూ పట్టుబడితే పట్టించుకోదు. పట్టించుకొని పట్టుబడిన గుఢచారులను ప్రాణాలతో తీసుకురావాలంటే కత్తిమీద సామే. అది అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే పొరపాటున ఏదేశంలోనైనా గూఢచారులు దొరికిపోతే వాళ్లు అక్కడి జైల్లలో మగ్గిపోవడమో, లేదా చనిపోవడమో జరుగుతుంది. కానీ తిరిగి వాళ్ల సొంత దేశాలకు మాత్రం చేరుకోవడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. ఈ స్టోరీ అంతా ఎందుకంటే.. ప్రపంచంలో ఎక్కడ చోటుచేసుకోని విధంగా ఓ గూఢచారిని ఓ నిమ్మకాయ పట్టించి ప్రాణాలు తీసింది. ఇంతకీ ఎక్కడ జరిగిందీ కథ, ఎప్పుడు జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Mayookham: 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో తొలి ఇండియన్ సినిమా “మయూఖం
ఏజెంట్ కార్ల్ ముల్లర్..
ఏజెంట్ కార్ల్ ముల్లర్. ఈయన 1915 జనవరిలో రష్యా షిప్పింగ్ బ్రోకర్‌గా నటిస్తూ బ్రిటన్‌లోకి అడుగుపెట్టాడు. నకిలీ పత్రాలు, గడ్డంతో బెల్జియం నుంచి వచ్చిన శరణార్థిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనో జర్మన ఏజెంట్. ఆయన బ్రిటిష్ సైన్యం కదలికల గురించి జర్మనీకి నివేదించేందుకు బ్రిటన్‌లోకి అడుగుపెట్టాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆయన తన ఆయుధంగా ఏ పిస్టల్నో లేదా బాంబునో ఉపయోగించలేదు. అవునండీ బాబు ఆయన తన ప్రమాదకరమైన ఆయుధంగా ఓ నిమ్మకాయను ఉపయోగించేవాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆయన ఆ నిమ్మకాయను ఓ పెన్నుతో గుచ్చి, దాని ద్రవాన్ని తీసుకుని మామూలు లేఖల మధ్యలో రహస్య సందేశాలు రాసేవాడు. తర్వాత వాటిని చేర్చవల్సిన చోటుకు ఎటువంటి అనుమానం రాకుండా పంపించే వాడు. వీటిలో ఆ రహస్య సమాచారం ఉన్నట్లు కూడా ఎవరికీ అనుమానం రాదు. ఎలా ఆ సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఆ కాగితాన్ని వేడి చేస్తే మాత్రమే ఈ అదృశ్యమైన అక్షరాలు బయటికి కనిపించేవి. దీనిని పురాతన అదృశ్య సిరా పద్ధతిని అంటారు.
ఎలా పట్టుబడ్డాడు అంటే..
బ్రిటన్ పోస్టల్ సెన్సార్షిప్ కార్యాలయం శత్రువుల కదలికల గురించి అప్రమత్తంగా ఉంది. ఈక్రమంలో రొట్టర్డామ్ పోస్ట్ ఆఫీస్ బాక్స్‌కు వచ్చిన ఒక లేఖ వారికి అనుమానం కలిగించింది. MI5 అధికారులు ఆ లేఖను వేడి చేయగా, సైన్యం కదలికలకు సంబంధించిన కోడెడ్ నోట్స్ బయటపడ్డాయి. ఈ దర్యాప్తులో ముల్లర్ సహాయకుడు, ఓ బేకరీ ఉద్యోగి జాన్ హాన్ ప్రత్యేక అధికారులకు చిక్కాడు. అతని ఇంట్లో పెన్ను గుచ్చిన నిమ్మకాయ ఒకటి దొరికింది. అది ఎంత పని చేసిందంటే కేవలం దానిని ఆధారంగా చేసుకొని అధికారులు ముల్లర్‌ను పట్టుకొని అరెస్టు చేసే వరకు వెళ్లారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ముల్లర్‌ను అరెస్ట్ చేసే టైంలో పాపం ఆయన ఓవర్‌కోట్ జేబులో కూడా ఒక నిమ్మపండు దొరికింది. దీంతో దర్యాప్తు అధికారులు ముల్లర్‌కు మరిన్ని ప్రశ్నలు వేశారు. నిమ్మకాయలు ఎందుకు తీసుకువెళ్తున్నావని అడగ్గా, ఆయన వాటిని “పళ్లు శుభ్రం చేసుకోవడానికి” అని చెప్పాడు. ఆ సమాధానంతో అధికారులు శాంతించలేదు. ఫొరెన్సిక్ పరీక్షలో అతని పెన్ను మీద నిమ్మకాయల సెల్ ఫోర్సుల ఆనవాళ్లు దొరికాయి. ఇది నేరానికి సంబంధించిన కీలక సాక్ష్యం. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం 1915 జూన్‌లో ముల్లర్, హాన్ ఇద్దరికీ రహస్య విచారణ నిర్వహించారు. చేసిన పనికి హాన్ ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ముల్లర్‌కు గూఢచర్య నేరం కింద మరణశిక్ష పడింది. 1915 జూన్ 23న ముల్లర్‌ను లండన్ టవర్‌లో ఉరితీశారు.
READ ALSO: India Japan Deals: జపాన్-భారత్ మధ్య కీలక ఒప్పందాలు.. 10 ఏళ్లలో 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడి..