NTV Telugu Site icon

Vizag: విశాఖ జనసేన కార్పొరేటర్కు త్వరలో లీగల్ నోటీస్..!

Vizag

Vizag

విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీసులు ఇవ్వనున్నారు. మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన, నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్/రిజాయిండర్ ఇవ్వడమైనది.

Read Also: Cyclone Remal: తీవ్ర తుఫానుగా మారిన ‘రెమల్’.. బంగ్లాదేశ్, బెంగాల్ తీరాన్ని తాకనున్న తుఫాన్

అయినప్పటికీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మరొకసారి ఆదివారం విశాఖపట్నంలో మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్.జవహర్ రెడ్డి వారిపై మరొకసారి అవే అసత్య, నిరాధారమైన ఆరోపణలను చేయడం తీవ్రంగా పరిగణించడమైనది. మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించడం జరిగింది. త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు జారీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి తెలిపారు.

Read Also: Nitish Kumar: నోరుజారిన నితీష్ కుమార్.. “మోడీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ”..

కాగా.. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలో ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. పేద రైతుల ఎసైన్డ్‌ భూములను లాక్కున్నారన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.