Site icon NTV Telugu

Left parties: కనుమరుగైపోతున్న కమ్యూనిస్టు పార్టీలు..

Left Parties

Left Parties

ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుతం మనుగడ కష్టతరంగా మారింది. సీట్లు తగ్గడం వల్ల జాతీయ రాజకీయాల్లో వామపక్షాలు కూడా అప్రస్తుతం అవుతున్నాయి. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో నాలుగు వామపక్షాలు కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. వారి సాంప్రదాయక కంచుకోటలైన కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో కూడా కమ్యూనిస్తు పార్టీల ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.

Read Also: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

ఇక, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మూడు ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కొన్నిసార్లు మూడో స్థానంలోనూ, కొన్నిసార్లు నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీగానూ నిలిచింది. అయితే, ఇంతలోనే కమ్యూనిస్టు పార్టీలో చీలిక రావడంతో కొత్త పార్టీలు కూడా ఏర్పడ్డాయి. ఈ ధోరణి 2004 వరకు కొనసాగింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం పడిపోవడంతో పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం కూడా తగ్గిపోయింది. అయితే, కేరళలో ఇప్పటికీ సీపీఐ(ఎం) నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ, అక్కడ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో కూడా ఒకే ఒక్క సీటును సీపీఐం గెలుచుకుంది. అక్కడి సీపీఐ(ఎం) ఓట్ల శాతం 25.82 ఉండగా.. ఆ పార్టీకి 6.14 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో 32 శాతం ఓట్లు సాధించినా వామపక్షాలు ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగాయి. పశ్చిమ బెంగాల్, త్రిపురలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక, పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలకు ఆరు శాతం ఓట్లు రాగా, త్రిపురలో దాదాపు 12 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

Read Also: Monsoon: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు..

అలాగే, తమిళనాడులో సీపీఐ(ఎం), సీపీఐలు ఇండియా కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి రెండేసి సీట్లలో విజయం సాధించాయి. అలాగే, రాజస్థాన్‌లో ఒక్క సీటు, బీహార్‌లో సీపీఐ-ఎంఎల్‌ రెండు సీట్లు గెలుచుకోగలిగింది. ఇలా మొత్తం ఎనిమిది సీట్లు వామపక్షాలకు దక్కాయి. అంటే గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. అయితే ఈసారి విపక్షాల పనితీరు మెరుగుపడిన తీరు చూస్తే గతంలో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక, 2004 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు అద్భుత ప్రదర్శన చేసి యూపీఏ ప్రభుత్వంలో భాగమయ్యాయి. ఆ సమయంలో దేశంలో కాంగ్రెస్, బీజేపీల తర్వాత సీపీఎం మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఐ(ఎం) 43 సీట్లు, సీపీఐ 10, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్ చెరో మూడు స్థానాల్లో విజయం సాధించాయి. 2004లో యూపీఏ ప్రభుత్వంలో చేరి కాంగ్రెస్‌తో జత కట్టడం వల్లే వామపక్షాలు నష్టపోయాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా 2009లో 24, 2014లో 11, 2019లో కేవలం ఆరుగురికి మాత్రమే సీట్లు గెలిచాయి.

Read Also: Russia President: అణ్వాయుధాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాం..

కాగా, కేరళలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ పుంజుకోవడంతో వామపక్షాలు నష్టపోతున్నాయి. కేరళలో హిందువుల ఓట్లను బీజేపీ తనవైపు ఆకర్షిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల ఓట్లు బీజేపీ, తృణమూల్‌ వైపు వెళ్లాయి. దాదాపు త్రిపుర పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్లమెంట్‌లో వామపక్ష పార్టీల ఉనికి తగ్గిపోవడంతో కార్మికులు, బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం పోరాటం బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. 2004 నుంచి 2024 వరకు వామపక్షాల ఓట్ల శాతం ఇదే..
2004- 7.85
2009- 7.46
2014- 4.55
2019- 2.46
2024- 2.54

Exit mobile version