NTV Telugu Site icon

Lectrix EV Scooter Launch: ఎథర్‌, ఓలాకు పోటీగా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

Lectrix Ev Scooter

Lectrix Ev Scooter

Lectrix EV Scooter Launch, Price and Range: భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆ‍కట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ మార్కెట్‌ను ఓలా, ఎథర్‌, టీవీఎస్‌, సింపుల్ వన్ ఏలుతున్నాయి. తాజాగా వీటికి పోటీనిచ్చేలా సరికొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ ప్రకటించింది. ‘లెక్ట్రిక్స్‌’ పేరుతో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ప్రారంభంలో కంపెనీ ఈ స్కూటర్‌ను లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ భారతదేశంలో ఇప్పటికే లుమినస్‌, లివ్‌గార్డ్‌, లివ్‌ఫాస్ట్‌, లివ్‌ ప్యూర్‌ వంటి బ్రాండ్స్‌ నిర్వహిస్తుంది. ప్రధానంగా గృహ అవసరాలతో పాటు పెట్రో వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీలను రూపొందిస్తుంది. దాంతో ఎస్‌ఏఆర్‌ కంపెనీ కొత్త ఈవీని లాంచ్‌ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. లెక్ట్రిక్స్‌ స్కూటర్‌ బుకింగ్స్‌ ఆగస్టు నెలలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్కూటర్‌ ధర రూ. 1 లక్ష నుంచి లక్షా యాభై వేల మధ్య ఉంటుందని అంచనా. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ ఈవీ స్కూటర్‌గా ఉండనుందని తెలుస్తోంది.

Also Read: IND vs WI: టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్!

లెక్ట్రిక్స్‌ స్కూటర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌లతో చాలా ఆకర్షణీయంగా ఉండనుందని సమాచారం. ఇందులో ఎమర్జెన్సీ అసిస్ట్‌ ఫీచర్లు, స్మార్ట్‌ ఇగ్నిషన్‌, ఆటో కన్సెలింగ్‌ ఇండికేటర్‌తో వస్తుందట. ఈ స్కూటర్‌ బ్లూటూత్‌ కనెక్టవిటీతో నావిగేషన్‌ ఫీచర్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే.. 100 కిమీ రేంజ్‌ ఇస్తుందని తెలుస్తోంది. బ్యాటరీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ స్కూటర్‌ ఆటోమేటిక్‌గా వేగాన్ని తగ్గిస్తుంది. అధునాతన ఫీచర్లతో వచ్చే ఈ లెక్ట్రిక్స్‌ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Ishan Kishan Six: విరాట్ కోహ్లీ నిర్ణయంతోనే ఈ హాఫ్ సెంచరీ సాధ్యమైంది: ఇషాన్‌ కిషన్