Telangana Assembly Elections 2023: ముహూర్త బలం.. భారీగా నామినేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పలువురు.. ఇవాళ ముహూర్తం బాగుండటంతో.. ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీబాస్ కేసీఆర్ ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కామారెడ్డిలో ఆర్డీవో కార్యాలయంలో కేసీఆర్ నామినేషన్ వేశారు. నామినేషన్ తర్వాత ప్రచారం వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో హరీశ్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత కాసేపు బైక్ ప్రయాణించి సందడి చేశారు.
సీఎల్పీనేత భట్టి విక్రమార్క.. మధిరలో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయాన్నే వివిధ మతపెద్దల ఆశీర్వచనాలు తీసుకున్న సీఎల్పీనేత.. ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరారు. అభిమానులు, కార్యకర్తలు వెంట రాగా భట్టి విక్రమార్క.. నామినేషన్ వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి నామినేషన్ వేశారు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి. భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి.. నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్‌లో నామినేషన్ వేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన.. స్థానిక నేతలతో కలిసి వెళ్లి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
Also Read
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, వివేకానంద, సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, వరంగల్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కత్తిదాడితో పది రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్‌రెడ్డి.. అంబులెన్స్‌లో దుబ్బాక వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వీల్‌చైర్‌లోని రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానానికి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
సూర్యాపేట జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రేపటితో పార్టీ గడువు ముగియనుండడం.. కాంగ్రెస్ తరపున అభ్యర్థిని ప్రకటించకపోవడంతో.. ఆ పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు.. పటేల్ రమేష్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీలతో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు నేతలు. ఇద్దరు నేతలు పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేయడంతో.. ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి అవుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!