CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ నేతలు కలిశారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసినందుకు ఏపీజీఈఎఫ్ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ఫెడరేషన్ నేతలు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.
Also Read: Prakash Raj: యాక్టర్ ప్రకాష్ రాజ్‌కి ఈడీ సమన్లు.. రూ.100 కోట్ల మోసం కేసులో విచారణ..
పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చినందుకు ఉద్యోగ సంఘ నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా ఉద్యోగులకు ఇస్తున్న పిల్లల సంరక్షణ సెలవులు 18 సంవత్సరాల నిబంధన తొలగించాలని కోరామని ఏపీజీఈఎఫ్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ కోసం వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన సంగతి తెలిసిందే.మొత్తం 6,700 మంది టీటీడీ ఉద్యోగులు ఉండగా.. దాదాపు అందరికి ఇంటి స్థల పట్టాలు పంపిణీ చేసింది జగన్ సర్కారు.