NTV Telugu Site icon

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తిపై దాడి?(వీడియో)

Viral

Viral

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు క్షత్రియ కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్ రివార్డ్ ప్రకటించడంతో కలకలం మొదలైంది. ఇదిలా ఉండగా.. లారెన్స్ ను ఎన్‌కౌంటర్ చేసినందుకు రివార్డ్ ప్రకటించడంతో ఆగ్రహించిన ప్రజలు కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్‌పై దాడి చేశారని సోషల్ మీడియాలో దీనికి చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది. తాజాగా ఈ వైరల్ అవుతున్న వీడియోలో కొందరు వ్యక్తులు రాజ్ షెకావత్‌ను బలవంతంగా కారులోకి ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఈ సమయంలో.. పెద్దపెద్దగా అరుస్తూ అతడిపై దాడి చేసేందుకు పలువురు యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వెనక నుంచి అతని తలపాగాను బలవంతం లాగడం వల్ల పడిపోయింది.

READ MORE: Drinker Hulchul: తాగుబోతు హల్‌చల్.. పీకలదాకా తాగి బస్సుపై నిద్రించిన మందుబాబు

అయితే.. 2023లో రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీని కాల్చిచంపారు. ఆయనను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. దీంతో రాజ్ షెకావత్‌ లారెన్స్‌ను చంపాలని పోలీసులకు రివార్డ్ ప్రకకటించారు. ‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా వారి భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం రూ.కోటికి పైగా ఇస్తాం. ఈ గ్యాంగ్‌ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదు’’ అని రాజ్ షెకావత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది.

READ MORE:Waqf bill: ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.. వక్ఫ్ బిల్లుని ఆపేస్తాం.. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చీఫ్..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన ఓ జాతీయ మీడియా సంస్థ ఈ వీడియోకి సంబంధించిన సమాచారాన్ని అందించింది. ఈ వీడియో పాతదని.. రివార్డ్ గురించి రాజ్ షెకావత్ స్టేట్‌మెంట్ కంటే ముందు జరిగిన ఘటనకు సంబంధించినది తెలిపింది. గతంలో నిరసన చేసేందుకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న కర్ణి సేనకు చెందిన రాజ్ షెకావత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటిదని చెబుతున్నారు.