Site icon NTV Telugu

Harassment : జేసీ లా కాలేజీలో విద్యార్ధినులపై కీచక పర్వం

Physically Harassment

Physically Harassment

కామాంధులు రోజు రోజుక రెచ్చిపోతున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా.. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం మదమెక్కి వ్యవహరిస్తున్నారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తమ లైంగిక కోర్కెల తీర్చుకోవడానికి వారిని వాడుకుంటున్నారు. అలాంటి ఓ కామాంధుడి గుట్ట రట్టు చేశారు విద్యార్థినులు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని జాగర్లమూడి చంద్రమౌళి లా కాలేజీలో విద్యార్థునులపై లైంగిక వేధింపులు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్‌ చేస్తూ.. వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్న జూనియర్‌ అసిస్టెంట్‌ అరవింద్‌ కుమార్‌కు విద్యార్థినులను వేధిస్తున్నాడు.

Also Read : America: మంచు గుప్పిట్లో అగ్రరాజ్యం.. 1500కు పైగా విమానాలు రద్దు

దీంతో విద్యార్ధినిలు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పై అధికారులు విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు జూనియర్‌ అసిస్టెంట్‌ అరవింద్ కుమార్‌ విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తున్నట్లు తేలింది. విచారణలో 12 మంది విద్యార్డినులు తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని కమిటీకి వివరించారు. ఈ నేపథ్యంలో 118 మంది విద్యార్థులను అధికారులు విచారించారు. లైంగిక వేధింపులు నిజమని తేలడంతో లా కాలేజీ జూనియర్ అసిస్టెంట్ అరవింద్ కుమార్ ను విధుల నుంచి అధికారులు తొలగించారు. అంతేకాకుండా.. భవిష్యత్‌లో ఇలాంటి వ్యవహారాలు జరగకుండా పట్టిన చర్యలు తీసుకుంటున్నామని లా కాలేజీ ప్రిన్సిపల్ సుధాకర్ వెల్లడించారు.

Also Read : Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాని విమానం నుంచి దించి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Exit mobile version