NTV Telugu Site icon

Lava Yuva 5G: రెండు స్టోరేజ్ వేరియంట్లలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన లావా..

Lava Yuva 5g

Lava Yuva 5g

మే 30 దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ యువ 5జీ ని 2 స్టోరేజ్ వేరియంట్‌లలో గురువారం విడుదల చేసింది. 64 GB వేరియంట్ ధర రూ. 9,499 ఉండగా., 128 GB వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. జూన్ 5 నుండి అమెజాన్, లావా ఇ-స్టోర్, లావా రిటైల్ అవుట్‌లెట్‌ లలో యువ 5G విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది మిస్టిక్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ అనే రెండు రంగులలో వస్తుంది. యువ 5G యువత కోసం రూపొందించబడింది. యువత వాడడంకి ఇది సరిగా సరిపోతుంది. పవర్ ప్యాక్డ్ ఫీచర్లు, పూర్తి భద్రత, హామీతో కూడిన అప్‌డేట్‌ లతో చింతలేని అనుభవాన్ని అందిస్తాయని లావా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ హెడ్ పురవంశ్ మైత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు.

Noida: ఎండ తీవ్రతకు బాల్కనిలో వాషింగ్ మిషన్ పేలి.. భారీగా మంటలు

స్మార్ట్‌ ఫోన్‌ లో గ్లాస్ బ్యాక్ డిజైన్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4GB+4GB ర్యామ్ మరియు 8MP సెల్ఫీ కెమెరాతో 50MP ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ తో 6.5 అంగుళాల HD+ పంచ్ హోల్ డిస్‌ప్లే తో 18W టైప్ -C ఫాస్ట్ ఛార్జర్‌ తో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. పవర్ ప్యాక్డ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, డ్యూయల్ ఏఐ కెమెరా, కొత్త యువ 5G ఫాస్ట్ ఛార్జింగ్ ఈ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ లను సెట్ చేస్తుంది. ఇది వినియోగదారులకు అత్యుత్తమ సాంకేతికత, సృజనాత్మకతను తీసుకువస్తుందని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ అన్నారు.

Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!

వీటితోపాటు., స్మార్ట్‌ఫోన్ బ్లోట్‌వేర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ లేకుండా ఆండ్రాయిడ్ 13ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.