NTV Telugu Site icon

LAVA Yuva 4: వావ్.. తక్కువ ధరకే ఇన్ని ఫీచర్లా? మార్కెట్లోకి వచ్చేసిన లావా స్మార్ట్‌ఫోన్

Lava

Lava

LAVA Yuva 4: భారతదేశ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ లావా యువ 4ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. Unisoc T606 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ సంబంధిత విశేషాలను చూస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక ఈ కొత్త ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌ లలో అందించబడుతుంది. అయితే, ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్‌ల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Also Read: Jio Recharge: బంపర్ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటాతోపాటు అదనంగా 20GB ఉచితం..

ఈ ఫోన్ ఫిబ్రవరి నెలలో ప్రారంభించిన లావా యువ 3కి అప్డేట్ వర్షన్ ఈ యువ 4. ఈ కొత్త లావా యువ 4 లో 6.56 అంగుళాల HD+ స్క్రీన్‌ కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్‌తో Unisoc T606 SoCని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 పై రన్ అవుతుంది. ఇందులో కెమెరా సెటప్ గురించి చూస్తే.. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక ఫోన్ లోని బ్యాటరీ వివరాలు చూస్తే.. 5,000mAh బ్యాటరీ ఇందులో పొందుపరిచారు. ఇది 10W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక సేఫ్టీ ఫీచర్‌గా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఇన్‌స్టాల్ చేయబడింది. ఇక ఈ ఫోన్‌ చూడడానికి ‘గ్లోసీ బ్యాక్ డిజైన్’ ఉంది.

Also Read: Train Ticket Name Change: బుకింగ్ చేసిన రైలు టికెట్‭లో పేరును ఎలా మార్చుకోవాలంటే?

ఇక ఈ కొత్త లావా యువ 4 బేస్ మోడల్ 4GB + 64GB వేరియంట్ కు రూ.6,999 ధరను నిర్ణయించారు. అలాగే 4GB + 128GB వేరియంట్ ధర రూ.7,499 గా నిర్ణయించారు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోసీ బ్లాక్, గ్లోసీ పర్పుల్ ఇంకా గ్లోసీ వైట్ కలర్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసింది.