LAVA Yuva 4: వావ్.. తక్కువ ధరకే ఇన్ని ఫీచర్లా? మార్కెట్లోకి వచ్చేసిన లావా స్మార్ట్‌ఫోన్
- తక్కువ ధరకే మంచి ఫిచర్స్..
- మార్కెట్లోకి వచ్చేసిన లావా స్మార్ట్‌ఫోన్.
- వివరాలు ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LAVA Yuva 4: భారతదేశ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ లావా యువ 4ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. Unisoc T606 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ సంబంధిత విశేషాలను చూస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక ఈ కొత్త ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్ లలో అందించబడుతుంది. అయితే, ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్‌ల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Also Read: Jio Recharge: బంపర్ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటాతోపాటు అదనంగా 20GB ఉచితం..
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఈ ఫోన్ ఫిబ్రవరి నెలలో ప్రారంభించిన లావా యువ 3కి అప్డేట్ వర్షన్ ఈ యువ 4. ఈ కొత్త లావా యువ 4 లో 6.56 అంగుళాల HD+ స్క్రీన్ కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్‌తో Unisoc T606 SoCని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 పై రన్ అవుతుంది. ఇందులో కెమెరా సెటప్ గురించి చూస్తే.. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక ఫోన్ లోని బ్యాటరీ వివరాలు చూస్తే.. 5,000mAh బ్యాటరీ ఇందులో పొందుపరిచారు. ఇది 10W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక సేఫ్టీ ఫీచర్‌గా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఇన్‌స్టాల్ చేయబడింది. ఇక ఈ ఫోన్ చూడడానికి ‘గ్లోసీ బ్యాక్ డిజైన్’ ఉంది.
Also Read: Train Ticket Name Change: బుకింగ్ చేసిన రైలు టికెట్లో పేరును ఎలా మార్చుకోవాలంటే?
ఇక ఈ కొత్త లావా యువ 4 బేస్ మోడల్ 4GB + 64GB వేరియంట్ కు రూ.6,999 ధరను నిర్ణయించారు. అలాగే 4GB + 128GB వేరియంట్ ధర రూ.7,499 గా నిర్ణయించారు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోసీ బ్లాక్, గ్లోసీ పర్పుల్ ఇంకా గ్లోసీ వైట్ కలర్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసింది.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?