Delhi Girl Murder Case: ఢిల్లీ మర్డర్ కేసు నిందితుడికి పోలీస్ కస్టడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Girl Murder Case: రెండు రోజుల క్రితం ఢిల్లీలోని షాబాద్ ఏరియాలో 16 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడు సాహిల్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. భద్రతాకారణాల రీత్యా నిందితుడిని కోర్టుకు కాకుండా రోహిణి కోర్టు డ్యూటీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జ్యోతి నాయిన్ ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి .. నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితుడు సాహిల్ హత్యకు వినియోగించిన ఆయుధాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడు మాటిమాటికి మాట మారుస్తున్నాడని.. కాబట్టి కేసులో స్పష్టత కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయమూర్తికి సమర్పించిన డాక్యుమెంట్లలో కోరినట్లు సమాచారం.
Read Also: Jupalli krishna rao: నేను పొంగులేటి ఇద్దరమే కాదు.. ఈటెల లాంటి వాళ్లు కూడా మాతోనే..!
Also Read
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
అయితే నిందితుడు సాహిల్, హత్యకు గురైన బాలిక గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఆదివారం బాలిక రిలేషన్‌ను ఆపేద్దామని చెప్పడంతో సాహిల్ ఆగ్రహానికి లోనయ్యాడని.. అదే ఆవేశంతో బాలికను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా పక్కనున్న కంకర, సిమెంటుతో కూడిన గడ్డతో తలపై మోదాడని చెప్పారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!