Site icon NTV Telugu

RC16 : చరణ్ భారీ సినిమాలోకి జగ్గూ భాయ్

Rc16 (1)

Rc16 (1)

RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇది రామ్ చరణ్ 16వ సినిమా. దీనికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హీరోకి ఇది 16వ సినిమా కాబట్టి ఆర్సీ16 అని పిలుస్తున్నారు. బుచ్చిబాబు ఈరోజు ఉదయం మైసూరులోని శ్రీ చాముండేశ్వరి మాత ఆలయానికి వెళ్లారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం మైసూర్ లో లేడు.

Read Also:Botsa Satyanarayana: సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే పీఏసీ.. సభ్యుల సంఖ్యతో సంబంధంలేదు..

సోమవారం నుంచి మైసూరులో రామ్ చరణ్ షూటింగులో పాల్గొనే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఆయన మైసూరు వెళ్లే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి రామ్ చరణ్ పై సన్నివేశాలను చిత్రీకరించేందుకు బుచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి వరకు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్రాన్ని ఊహించని కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో తమ “రంగస్థలం” సినిమా ప్రెసిడెంట్ పాత్రలో జీవించిన వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు చేరినట్లుగా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాలో తాను ఒక కమాండింగ్ పాత్ర చేయనుండగా అది అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమాలో జగ్గూ భాయ్ ఎలా చేస్తారో చూడాలి.

Read Also:Nitish Reddy: నితీశ్ రెడ్డి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!

Exit mobile version