Site icon NTV Telugu

AP Assembly : నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Ap Assembly

Ap Assembly

నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం టిడ్కో గృహాల అంశంపై లఘు చర్చ జరుగనుంది. ఆర్థిక పరిస్థితిపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ముఖ్యంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఐదేళ్ల జగన్​ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేసింది.

Shoaib Malik Big Statement: పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కీలక ప్రకటన..!

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఇప్పటికే పలు అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ఆయన వాటి వివరాలను ప్రజల ముందుంచారు. దీంతోపాటు టిడ్కో గృహాల స్థితిగతులపై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు. ఈ నెలాఖరుతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ముగియనున్నందున కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నా ప్రస్తుత సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదు.

Kargil Vijay Diwas 2024: కార్గిల్ విజయ్ దివాస్ చరిత్ర మీకు తెలుసా? రోమాలు నిక్కబొడిచే కథ..

Exit mobile version