Site icon NTV Telugu

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం

Air Bus

Air Bus

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం ఆగింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ నిన్న (మంగళవారం) శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇల్లా ఎయిర్‌బస్ బెలూగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి రావడం ఇది సెకండ్ టైం. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎయిర్ పోర్టు నిర్వహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా.. ఇది ఎయిర్ కార్గోను రవాణా చేయడానికి ప్రసిద్ధి చెందింది.

Read Also: Krishna Gadu Ante Oka Range: ప్యాషన్ ఇన్వెస్ట్ చేస్తే పదింతల డబ్బు, పేరు.. రైటర్ ప్రసన్న కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అయితే, నిన్న(మంగళవారం) శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీన్ని చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపించారు. ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల సామర్థ్యం ఈ బెలూగా సొంతం. 184 అడుగుల పొడవు, 56 అడుగుల ఎత్తు, ఒక్కో రెక్క వెడల్పు 2800 చదరపు అడుగులు. విమానం బరువు 86 టన్నులకు పైగానే ఉంటుంది. కాగా, ఈ బెలూగా కార్గో విమానం తొలిసారిగా 2022 డిసెంబర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. మళ్లీ తిరిగి నిన్న (ఆగస్టు 1, 2023వ తేదీన) వచ్చింది. 1996లో మొదటిసారిగా ఎయిర్ బస్.. అతిపెద్ద ఈ కార్గో విమానాన్ని తయారు చేసింది. దీంట్లో అనేక మార్పులు చేస్తూ సామర్థ్యం పెంచుకుంటూ వస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ ఎయిర్ బస్ కార్గో విమానం పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: Indigo Offer: ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్‌ ఆఫర్‌.. టిక్కెట్‌పై రూ.2000 భారీ తగ్గింపు..

Exit mobile version