GHMC : లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ హుడా పార్క్ చెరువు శుభ్రం చేసే క్రమంలో తండ్రి కొడుకుల మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంగర్ హౌస్ లోని హుడా పార్క్ చెరువులో చెరువు శుభ్రం చేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మహమ్మద్ కరీం (38 ) ఈరోజు శివరాత్రి సందర్భంగా స్కూలుకి సెలవు ఉండడం వల్ల తన కొడుకు సాహిల్ (15)ను తనతో పాటు తీసుకువచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మహమ్మద్ కరీం తన కొడుకు సాయిల్ తో కలిసి హుడా పార్క్ చెరువులోని గుర్రపు డెక్కను శుభ్రం చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బురదలో ఇరుక్కుపోయి తన తండ్రిని సహాయం కోరాడు. దీంతో తండ్రి కరీం కూడా వెళ్లి తన కొడుకు సాయం చేసే క్రమంలో ఇద్దరు నీళ్లలో లోతుగా బురదలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించి సాయంత్రం సమయానికి ఇద్దరి మృతదేహాలను బయటకు వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NIT-Calicut Professor: గాడ్సేని ప్రశంసించిన ఎన్ఐటీ ప్రొఫెసర్ డీన్‌గా నియామకం.. వివాదం..