NTV Telugu Site icon

Chandrayaan-3: జాబిల్లి తొలి ఫొటోలు తీసిన ల్యాండర్.. షేర్ చేసిన ఇస్రో

Chandryan 3

Chandryan 3

జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. మరోవైపు చంద్రయాన్-3 ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. తాజాగా ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ విడిపోయిన విషయం తెలిసిందే. ల్యాండర్ ఇమేజర్ (LI) కెమెరా-1 ద్వారా తీసిన అద్భుతమైన చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో X లో షేర్ చేసింది. అయితే గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోగానే ల్యాండర్ ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఆగస్టు 23 వ తేదీ బుధవారం చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద విక్రమ్ ల్యాండర్ దిగనుంది.

Read Also: Rithu Chowdary: రీతూ చౌదరి బ్రేకప్పా.. ఒక్క దెబ్బతో నోళ్ళు మూయించేసింది!

ల్యాండర్ విక్రమ్ తీసిన మొదటి ఫొటోలో చంద్రునిపై ఉన్న బిలాలను కూడా ఇస్రో గుర్తించింది. గార్డియానో బ్రూనో క్రేటర్ అనే పేరు కలిగిన బిలాన్ని గుర్తించారు. ఫ్యాబ్రీ క్రేటర్, గియార్డనో బ్రునో క్రేటర్, హర్కేబి జే క్రేటర్‌ ఫొటోలను తీసి విక్రమ్ ల్యాండర్ పంపించినట్లు ఇస్రో తెలిపింది. ఇటీవలే గుర్తించిన ఈ బిలం వ్యాసం దాదాపు 43 కిలోమీటర్లు ఉంటుంది. అయితే.. శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ మరింత విజయవంతమైనట్లు తెలిపారు.

Read Also: Rains Alert: ఇవాళ రాత్రికి భారీ వర్షాలు.. కలెక్టర్లను అలర్ట్ చేసిన సీఎస్

ఒకసారి ల్యాండర్ చంద్రున్ని తాకిన తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడివడుతుందని ఇస్రో తెలిపింది. అనంతరం రోవర్ కీలక సమాచారాన్ని సేకరిస్తుందని వెల్లడించింది. చంద్రుని ఆకృతి, శిథిలాలు, నీటి జాడ వంటి అనేక విషయాలను శోధిస్తుంది. ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఇప్పుడు చంద్రుని ఉపరితలానికి మరింత దగ్గరగా చేరువైంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.