NTV Telugu Site icon

Dharmana Prasada Rao: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ధర్మాన..

Dharmana

Dharmana

Dharmana Prasada Rao: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. అయితే, దేశవ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వస్తే అప్పుడు ఆలోచిస్తాం అన్నారు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై ఘాటుగా స్పందించారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పాం.. మళ్లీ ఇప్పుడు స్పష్టంచేస్తున్నాం అన్నారు. అయితే, భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం.. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉంది.. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టింది.. ఆ తర్వాత కూడా టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కానీ, దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తాం అన్నారు. న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు తర్వాత మాత్రమే ఆలోచన చేస్తామన్న ఆయన.. అంతవరకూ యాక్ట్‌ అమలు చేయమని గతంలోనే స్పష్టంచేశామని గుర్తుచేశారు.

ఇక, ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు అని తెలిపారు ధర్మాన.. ఇది కాకుండా రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశామన్న ఆయన.. సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోంది.. అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించాం.. దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయి.. పరిపాలన వికేంద్రకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయి.. మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది, ఆటోమేటిగ్‌గా మ్యుటేషన్ జరుగుతుంది.. ఇంత చేస్తుంటే.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. చేతకాని దద్దమ్మలు చేసే తప్పుడు ప్రచారాలు ఇవి.. రైతులకోసం ఏరోజూ ఆలోచించని దద్దమ్మలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైసీపీకి నష్టం కలిగించాలని టీడీపీకి ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి ధర్మాన.. సాఫ్ట్‌వేర్‌ ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ , ఆటో ముటేషన్ , ఈసీ జారీచేయటం వివిధ అంశాలలో ఉపయోగపడుతుంది. పౌరులకు ప్రయోజనకరమైన సాప్ట్ వేర్ ఇది. కానీ, అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఒక మెమో పట్టుకొని సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. న్యాయవాదుల పేరుతో అన్యాయంగా మాటాడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశంలో తీసుకురావాలనుకుంది. 1980 నుంచి ఈ యాక్ట్ తీసుకురావాలనుకుంటున్నారు. బీజేపీ నిర్ణయం కాదా? ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ అని నిలధీశారు. చట్టం చేసి మేం అమలు చేయాలని కొరుతున్నాం. రాష్ర్ట ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ఇది కాదన్న ఆయన.. 100 ఏండ్ల క్రితం భూమి సర్వే జరిగితే , ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు.. నేడు వైసీపీ గవర్నమెంట్ అత్యాధునిక టెక్నాలజీతో భూమి సర్వే చేస్తున్నాం అని వెల్లడించారు.

రాష్ర్టాంలో భూమి తీసుకోడానికి జగన్ చేస్తున్నారని చేతకాని మాటలు ఆడుతున్నారు. రైతుల గురించి ఎప్పుడూ మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు ధర్మాన.. భూములపై హక్కులు కల్పించిన జగన్ , పేదలకు ఇళ్ల కోసం భూములు ఇచ్చిన జగన్.. పేదల భూములు తీసుకుంటారా.? అని ప్రశ్నించారు. అబద్దపు ప్రచారాలతో ఎన్నికలలో గడిపేద్దాం అనుకుంటారా? చుక్కల భూములకు హక్కులు ఇచ్చింది జగన్ . రైతులు భూమి తీసుకొని వ్యాపారం చెయాలనుకున్న మీకు మాకు లెక్కేంటి..? అని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ర్టంలో ఇంకా అమలు కాలేదని గుర్తుచేశారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు..