NTV Telugu Site icon

Rajahmundry: ప్రధాన రహదారిలో ఒక్కసారిగా కుంగిపోయిన భూమి.. భయాందోళనకు గురైన స్థానికులు

Rajahmundry: రాజమండ్రి గోరక్షణ పేట ప్రధాన రహదారిలో భూమి కుంగిపోయింది. రోడ్డు మధ్య బీటలు వారి అమాంతంగా గొయ్యి పడింది. ఒక్కసారిగా భూమి కుంగిపోవటంతో స్థానికులు భయాందోళనలు గురయ్యారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు నిత్యం వేలాదిగా రాకపోకలు సాగించే ప్రధాన రహదారిలో భూమి కొంగిపోవటం భయాందోళనలు కలిగించింది. స్థానికులు వెంటనే స్పందించి ఈ రోడ్డు వైపుగా వాహనాలు రాకుండా భారీగా ఏర్పాటు చేశారు. భూమి కుంగిపోయిన సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Read Also: Nadendla Manohar: ఏ ఒక్క ఓటు చీలకూడదు.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి..

గతంలో కూడా పలుసార్లు ఈ ప్రాంతంలో భూమి కుంగిపోయిన సంఘటనలు జరిగాయి. భూమి కింద భాగంలో. మంచినీటి పైప్ లైన్ కు రంధ్రం పడి నీళ్లు లీక్ అయిపోవడంతో ఇక్కడ భూమి కుంగిపోయింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రదేశంలో ఎటువంటి వాహనాలు రాకపోకలు రాకుండా భారీకేట్లు ఏర్పాటు చేసి. కట్టడి చేశారు. తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రంగంలో దిగి యుద్ధ ప్రతిపాదించిన కృంగిపోయిన భూమిని జెసిబి సాయంతో తవ్వి మరమ్మతు చర్యలు. చేపడుతున్నారు. నీళ్లు లీక్ కాకుండా నివరించి పనులు చేస్తున్నారు. దీనితో గోరక్షణ పేటలో సాయంత్రం కుళాయిల్లో మంచినీటి విడుదల నిలిపివేశారు.