NTV Telugu Site icon

Land Mine: కూంబింగ్‌ చేస్తున్న జవాన్లకు తప్పిన ముప్పు

Land Mine

Land Mine

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో ప్రధాన రహదారిపై నిషేధిత (సీపీఐ) మావోయిస్టు పార్టీ అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. చెర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ 141 బిఎన్ సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ టీమ్ సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా చెర్ల మండలం బోడనెల్లి-ఎర్రబోరు గ్రామాల మధ్య రహదారిని తనిఖీ చేస్తుండగా 20 కిలోల మందుపాతరను గుర్తించారు. చెర్ల మండలంలోని కుర్నపల్లి, బత్తినపల్లి, రామచంద్రాపురం, ఎర్రబోరు గ్రామాలకు చెందిన ప్రజలు మందుపాతర వేసిన ఈ రహదారి గుండానే ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తున్నారని చెర్ల సీఐ బీ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read : Bhartat Biotech : భవిష్యత్ ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్, ఎల్లా ఫౌండేషన్ మరో ముందడుగు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి తెలంగాణలో కూలీ పనుల కోసం వచ్చే గిరిజనులకు ఇది ప్రధాన మార్గం. మావోయిస్టులు ప్రధాన రహదారులపై మందుపాతరలను అమర్చడం ద్వారా ఆదివాసీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. గత ఏడాది కాలంగా మావోయిస్టులు రోడ్ల పక్కన, పోడు భూముల దగ్గర, గ్రామాల సమీపంలో, అటవీ ప్రాంతాల్లో పశువులు మేపుతున్న గ్రామాలకు సమీపంలో ప్రెషర్ బాంబులు, పేలుడు పదార్థాలను అమర్చడంతో గిరిజనులు నిత్యం భయంతో జీవిస్తున్నారు.

Also Read : Uttam Kumar Reddy : రానున్న ఎన్నికల్లో 50వేల మెజార్టీ ఖాయం.. లేకుంటే రాజకీయాల్లోంచి తప్పుకుంటా