Bhartat Biotech : భవిష్యత్ ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్, ఎల్లా ఫౌండేషన్ మరో ముందడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భవిష్యత్ ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొనేందుకు మరో ముందడుగు వేశాయి భారత్ బయోటెక్, ఎల్లా ఫౌండేషన్. అయితే.. తాజాగా గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్-మాడిసన్, ఎల్లా ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయ విద్యా పరిశోధన విభాగం, బయోటెక్నాలజీ కార్యదర్శుల సమక్షంలో ఒప్పంద పత్రాలపై రెండు సంస్థల అధిపతులు సంతకాలు చేశారు. బెంగుళూరులో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ తో కలిసి “వన్ హెల్త్ సెంటర్” ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నూతన పరిశోధనలు, టీకాలు, చికిత్సా విధానాలు, ప్రపంచ ఆరోగ్య విద్యను అభివృద్ధి చేయడానికి భారతదేశంలో ఏర్పడుతున్న మొట్టమొదటి UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. గ్లోబల్ హెల్త్‌ను అభివృద్ధి చేయడం, ఆరోగ్య పర్యవేక్షణ, పరిశోధనలు, విద్య, ప్రచారాలు, మానవులు, జంతువులు, మొక్కలలో అంటు వ్యాధులను నివారించడం కోసం పని చేయనుంది UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్.
Also Read : Kalyan Ram: బింబిసార రిజల్ట్ రిపీట్ అవుతుంది.. మళ్లీ కాలర్ ఎగరేస్తాం
Also Read
భారతదేశంలో నూతన వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడంపై UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్ దృష్టి పెట్టనుంది. ఇంటర్ డిసిప్లినరీ సహకారాన్ని అందించడం ద్వారా విస్కాన్సన్ యూనివర్సిటీ ఆలోచనలను ఎల్లా ఫౌండేషన్, భారత్ బయోటెక్ విస్తరించనుంది. 2023 చివరి నాటికి బెంగళూరులో అందుబాటులోకి UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్ రానుంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్-మాడిసన్ బాడ్జర్ ఉత్సవ్‌లో “బ్యాడ్జర్స్ బిల్డింగ్ ఎ బెటర్ వరల్డ్” కార్యక్రమంలో ఒప్పందం కుదిరింది. భారతదేశం కోసం కొత్త వ్యాక్సిన్‌ల అభివృద్ధి, ఉత్పత్తిని ముందుకు తీసుకువెళ్లనుంది UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్. భారతీయ విద్యార్థులకు, పరిశోధకులకు నైపుణ్య శిక్షణకు సహకారం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ అందించనుంది. భారత్ లో పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించనుంది UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్. పరిశోధనలు, పరస్పర ఆలోచనలు పంచుకుంటూ… నూతన ఆవిష్కరణలకు గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్, ఎల్లా ఫౌండేషన్ ప్రాధాన్యత ఇవ్వనుంది.
Also Read : Amigos Event: నాటు నాటు పాటకి డాన్స్ చేసిన బ్రహ్మాజీ… పడి పడి నవ్విన ఎన్టీఆర్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!