గత ప్రభుత్వాలు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాను కబ్జా చేసి దానిని అక్రమించేందుకు జేసీబీల సహయంతో చదును చేసేందుకు వస్తున్నారని.. వెంటనే దానిని అపాలని గ్రామస్తులు ఎమ్మార్వో కార్యాలయం ముందు అందోళనకు దిగారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో అక్రమ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలో ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… సుల్తాన్ పల్లి గ్రామంలో సర్వే నంబర్ 129 మరియు 142 లో ఉన్న 25 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేశారంటూ గ్రామస్తుల అందోళనకు చేశారు.
Also Read : Gannavaram Incident: గన్నవరం ఘటన.. రెచ్చగొట్టింది ఎవరు?
సర్వే నెంబర్ 129లో 16 ఎకరాల 24 గంటలు, సర్వేనెంబర్ 142 లో 8 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. అయితే 2007 కాంగ్రెస్ హయాంలో 84 మందికి 60 గజాల చొప్పున ఇదే భూమిలో పట్టాలు మంజూరు చేశారు. కొందరు నాయకులు అధికారులతో కుమ్మక్కై పేద ప్రజలకు అందాల్సిన భూములను అక్రమంగా కాజేస్తున్నారని స్థానికుల ఆరోపణ చేశారు.
Also Read : Stray Dog : కుక్కలే కాదు.. కుక్కల ప్రేమికులు కూడా కరుస్తున్నారు జాగ్రత్త..
దీనిపై గ్రామస్తులు శంషాబాద్ ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్డీవోకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై ఎమ్మార్వో స్పందిస్తూ.. సమస్యను ఆర్డీవో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని ప్రస్తుతం అట్టి భూమిలో ఏలాంటి పనులు చేయనివ్వమని అన్నారు. పై ఆధికారుల అదేశాల అనంతరం చర్యలు చేపడతామని తెలిపారు.