Site icon NTV Telugu

Lalu Prasad Yadav: ప్రధానిగా ఉండాలంటే భార్య ఉండాలి.. లాలూ ప్రసాద్ యాదవ్ కొత్త షరత్

Lalu Prasad Ayadav

Lalu Prasad Ayadav

దేశానికి ప్రధాన మంత్రి ఎవరైనా సరే, వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ షరతు పెట్టారు. అయితే ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి అన్నారా లేదంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. అయితే విపక్ష కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీకి పెళ్లైనప్పటికీ.. కొద్ది రోజులకే వారు విడిపోయారు. చాలా కాలంగా ఆయన తన భార్యకు దూరంగా ఉంటున్నారు.

Also Read: Andhra Pradesh: సీఎంవోతో సంబంధాలున్నాయి.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు గుంజాడు..

రాబోయే పార్లమెంట్ ఎన్నిక‌ల కోసం ప్రతిపక్షాలు అన్నీ ఏకమయ్యాయి. అయితే ప్రతిపక్షానికి ప్రధాని అభ్యర్థిగా ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలో మీడియా లాలూ ప్రసాద్ యాదవ్ ను ఈ మేరకు ప్రశ్నించింది. దానికి స్పందిస్తూ ఆయ‌న ఈ కామెంట్స్ చేశారు. ప్రధాన మంత్రి వైవాహిక జీవితంపై, రాహుల్ గాంధీ పెళ్లిపై అనేక ప్రశ్నలు తరుచూ వస్తూనే ఉంటాయి.. పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశం అనంతరం రాహుల్‭ను పెళ్లి చేసుకొమ్మని లాలూ సూచించాడు.

Also Read: Health Tips : రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోతున్నారా? ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్లే..

బీజేపీకి విపక్షంగా ఉన్న నేపథ్యంలో లాలూ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీని ఉద్దేశించినవేనని కొందరు అనగా.. మరికొందరేమో పాట్నా సమావేశాన్ని ఉదహరిస్తూ రాహుల్ గాంధీని అన్నారని అంటున్నారు. ప్రధానిగా ఉండాలనుకునే వ్యక్తి ఎవ‌రైనా.. భార్యతోనే ప్రధాని ఆఫీస్ లో ఉండాలని లాలూ ప్రసాద్ యాదవ్ త‌న అభిప్రాయాన్ని వెల్లడించారు.

Exit mobile version