Lal Darwaza Bonalu: జులై 7 నుండి లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 7 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 115వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుటకుగాను దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయానికి రంగులు వేయడంతోపాటు, రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. జులై 7 నుండి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలలో తొలిరోజైన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం దేవి అభిషేకం, ద్వజారోహణ, శిఖరపూజ, సాయంత్రం కలశ స్థాపనతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. జులై 9వ తేదిన ఆదివారం సాయంత్రం షాలిబండ కాశీవిశ్వనాథ స్వామి దేవాలయం నుండి అమ్మవారి ఘటాన్ని భాజా భజంత్రీలు, డప్పు వాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టిస్తారు. ఆ తరువాత 9రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. జులై 16వ తేదిన అమ్మవారికి బోనాలు సమర్పన, రాత్రికి ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణము నిర్వహిస్తారు. జులై 17వ తేదిన పోతరాజు స్వాగతం, భవిష్యవాణిని వినిపించే రంగం, అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.
Also Read : Chicken or Egg: కోడి ముందా.. గుడ్డు ముందా?.. తేల్చేసిన సైంటిస్టులు
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ఢిల్లీలో లాల్ దర్వాజ బోనాలు : లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధానిలో బోనాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో జూన్ 19, 20, 21 తేదీలలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని దేవాలయ కమిటీ వెల్లడించింది. జూన్ 19వ తేదీన సోమవారము సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ ప్రాంగణంలో.. ఫోటో ఎగ్జిబిషన్‌ను పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభిస్తారు. మంగళవారం 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇండియా గేట్ నుండి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి.. తెలంగాణ భవన్ లో ప్రతిష్టాపన చేస్తాము. బుధవారం 21వ తేదీన ఉదయం 11 గంటలకు పోతరాజు స్వాగతం బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు విచ్చేసి, అమ్మవారిని దర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 100 మంది సాంస్కృతిక కళాకారులచే వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు. సాయంత్రం 6గంటలకు అంబేద్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమము జరుగుతుందని దేవాలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.
Also Read : AAP: “దేశానికి ఎప్పటికి ప్రధానిగా నరేంద్ర మోడీనే”.. ఆప్ సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!