Site icon NTV Telugu

Lakshmi Parvathy: తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొస్తాం

Lakshmi Parvathi 1674024006

Lakshmi Parvathi 1674024006

తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు తెలుగు సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ… రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ, తెలుగు యునివర్సిటీ ను వదిలేశారు చంద్రబాబు.సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవతో 2019 లో తెలుగు _సంస్కృత అకాడమి ఏర్పాటుకు నిర్ణయించారు. తిరుపతి కేంద్రంగా సీఎం వీటి ఏర్పాటుకు నిర్ణయించారు. తెలుగు అకాడమీ స్థాపించిన తర్వాత ఇంటర్మీడియట్ పుస్తకాలు ముద్రించాము. ప్రతి రాష్ట్రంలో సంస్కృత అకాడమీ ఉండటంతో ఏపి లో తెలుగు – సంస్కృతము అకాడమీ ఏర్పాటు చేశాం.

Read Also:K Laxman: బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే

తిరుపతి కేంద్రంగా 2022 నుంచి తెలుగు సంస్కృతము అకాడమీ నిర్వహిస్తున్నాం. ఉన్నత విద్యా శాఖ తో ఎం.వో.యు కుదుర్చుకున్నాము, డిగ్రీ పుస్తకాలు ముద్రణ కూడా చేస్తాం. తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అహర్నిశలు పాటుపడతాం అన్నారు లక్ష్మీపార్వతి. ఉద్యోగాలు ఇస్తాము అంటూ నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసాలు చేస్తున్నారు, 90 కోట్లు నిధులు రావాల్సి ఉంది, విలువైన ఆస్తులు ఉన్నాయి , తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం అన్నారు లక్ష్మీపార్వతి.

Read Also: KTR Tweet: గవర్నర్ తీరుపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

Exit mobile version