NTV Telugu Site icon

Lakshmi Parvathy: చంద్రబాబుని రజనీకాంత్ ఎలా సపోర్ట్ చేస్తాడు?

Laxmi Parvathi

Laxmi Parvathi

ఏపీలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పర్యటన కాక రేపుతోంది. ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి రజనీకాంత్ తీరుపై మండిపడ్డారు. రజనీకాంత్ కు బుద్ధీ ఙ్ఞానం లేదు.. చివరి రోజుల్లో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ మాట్లాడిన విషయాలు తెలియవా?? అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను రాజకీయ హత్య చేసిన వ్యక్తిని రజనీకాంత్ ఎలా సపోర్ట్ చేస్తాడు?ఎన్టీఆర్ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేని వ్యక్తులు ఆ వేదిక పై ఉన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీకాంత్ ఎందుకు ఖండించ లేదు?? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

Read Also: Ustaad Bhagat Singh: ఓరీ మీ దుంపలు తెగ.. సడెన్ గా చూసి నిజమే అనుకున్నాం కదరా బాబు

చంద్రబాబును పొగడటానికి ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాడా రజనీకాంత్? ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహమే రజనీకాంత్ కూడా చేశాడు. ఇప్పుడు చంద్రబాబును పొగడటం ద్వారా ఎన్టీఆర్ కు మరోసారి రజనీకాంత్ వెన్నుపోటు పొడుస్తున్నాడు. రజనీకాంత్, చంద్రబాబు ఇద్దరూ పిరికి వాళ్ళు. బీజేపీతో చేతులు కలపటానికి రజనీకాంత్ ను చంద్రబాబు పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రజనీకాంత్ వ్యాఖ్యల ప్రభావం ప్రజలపై ఉండదన్నారు లక్ష్మీపార్వతి. రజనీకాంత్ పై ఇప్పటికే వైసీపీ నేతలు కొడాలి నాని, మల్లాది విష్ణు, మార్గాని భరత్ విరుచుకుపడుతున్నారు.

Read Also: Mukhtar Ansari: యూపీ గ్యాంగ్‌స్టర్స్ అన్సారీ సోదరులకు జైలు శిక్ష.. ఒకరి ఎంపీ పదవి ఊస్ట్..