Lakshmi Parvathi: ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకు రావడం ఆశ్చర్య మేస్తోందని తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్త చేసిన లక్షల కోట్ల అవినీతి బయట పెట్టాలని ఆమె అన్నారు. నువ్వు, నీ అక్క దోపిడీ వర్గానికి చెందిన పచ్చి అవకాశవాదులంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఇద్దరు అవినీతి అనకొండలకు కొమ్ము కాయడానికి బస్సు యాత్ర మొదలు పెట్టావా అంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు.
Also Read: Kotamreddy Sridhar Reddy: కాకాని అధికారంలో ఉండేది మూడు నెలలు మాత్రమే..
చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడో ఎన్టీఆర్ చెప్పిన వీడియోను లక్ష్మీపార్వతి ప్రదర్శించారు. ఎన్టీఆర్ కడుపున పుడితే నీ భర్త తప్పు చేశాడు శిక్ష పడాల్సిందేనని ఒప్పుకో అంటూ వ్యాఖ్యానించారు. ధైర్యం ఉంటే హెరిటేజ్ లెక్కలన్నీ బయట పెట్టాలన్నారు లక్ష్మీపార్వతి. ఏ శాపమో మీలాంటి పిల్లలు ఎన్టీఆర్‌కు పుట్టారంటూ.. పవిత్రమైన దేవాలయాల్లో నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలని నీ తండ్రి మరణించాలని క్షుద్రపూజలు చేశావ్ అంటూ ఆమె అన్నారు. జనాన్ని లూఠీ చేసిన ఆయనకు మద్దతుగా బస్సుయాత్ర చేస్తున్నావా అంటూ లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.