Site icon NTV Telugu

Lakshmi Manchu-Kannappa: ‘కన్నప్ప’లో నటించడం లేదు.. విష్ణు అవకాశం ఇవ్వలేదు!

Lakshmi Manchu Kannapa

Lakshmi Manchu Kannapa

Lakshmi Manchu React on Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’లో తాను నటించడం లేదని లక్ష్మి మంచు తెలిపారు. తనకు సరిపోయే పాత్ర లేదేమోనని, అందుకే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అజయ్‌, వేదిక, లక్ష్మి మంచు ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌.. జూన్‌ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో లక్ష్మి మంచు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

కన్నప్పలో మీరు నటించడం లేదా? అన్న ప్రశ్నకు లక్ష్మి మంచు మాట్లాడుతూ… ‘మంచు విష్ణు కన్నప్పలో నేను ఎందుకు నటించడం లేదని చాలా మంది అడుగుతున్నారు. బహుశా నాకు సరిపోయే పాత్ర కన్నప్పలో లేదేమో. అందుకే నాకు అవకాశం ఇవ్వలేదు. ఇందులో మంచు మనోజ్‌ కూడా నటించడం లేదు. ఒకవేళ నేను, మనోజ్‌ ఉంటే.. అది మా ఫ్యామిలీ సినిమా అవుతుంది’ అని అన్నారు. బెంగళూరు రేవ్‌పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదని, దాని గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదని లక్ష్మి మంచు పేర్కొన్నారు.

Also Read: Pat Cummins: సన్‌రైజర్స్‌కు కలిసొచ్చిన విదేశీ కెప్టెన్సీ.. మూడో ఆసీస్ ప్లేయర్‌గా కమిన్స్!

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్‌ కుమార్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పలు భాషలకు చెందిన అగ్ర నటులు మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివ రాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌, ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ బాబు కన్నప్పను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ జూన్‌ 13న విడుదల కానుంది.

Exit mobile version