Lagcherla Incident : ఇటీవల కొడంగల్‌లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టు భూసేకరణను వ్యతిరేకిస్తూ జరిగిన దాడిని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తెలంగాణలో ఫార్మాసిటీ, పరిశ్రమల స్థాపనకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లక్చెర్ల గ్రామంలో నవంబర్ 11న నిర్వహించిన గ్రామసభలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతో సమావేశం హింసాత్మకంగా మారింది. అధికార ప్రకటనలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయెల్, సెక్రటరీ జయేష్ రంజన్ ఇలాంటి హింస ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోబోమని హామీ ఇచ్చారు.
Bombay HC: ‘‘సిగ్గుమాలిన చర్య’’.. అత్తపై అల్లుడి అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు..
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని గ్రామస్థులు కర్రలు, రాళ్లు రువ్వడంతో ఘర్షణ జరిగినట్లు సమాచారం. అయితే.. తాజాగా లగచర్ల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి ఘటనలో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ నేత సురేష్‌కు అసలు భూమి లేదని వికారాబాద్ కలెక్టర్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు వెల్లడించారు. సురేష్, సోదరుడు మహేష్‌కు ఎలాంటి భూమి లేదని నివేదికలో పేర్కొన్నారు. 42 మంది నిందితుల్లో 19 మందికి భూమి లేదని తేల్చిన కలెక్టర్ నివేదికలో తెలిపారు.
Arjun Tendulkar: ఐపీఎల్ వేలానికి ముందు రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగిన అర్జున్ టెండూల్కర్.. ఏకంగా?